బంగారం ధర గురవారం రూ.225 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.56,590 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగటం, రూపాయి విలువ క్షీణిస్తుండటం వంటి పరిణామాలు ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
వెండి ధర గురువారం కిలోకు ఏకంగా రూ.1,932 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.75,755 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,045.70 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.57 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:అన్ని రంగాల్లోనూ అంబానీ ముద్ర- పోటీ వీరి నుంచే...