దసరా రోజు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి (Gold Rate Today) ధరల్లో పెద్దగా మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలతో పాటు.. పెట్రోల్, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.49,390 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,020 వద్ద ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,390గా ఉంది. కిలో వెండి ధర రూ.65,020 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,390గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,020 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,794.60డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 23.49 డాలర్ల వద్ద ఉంది.
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..
దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price today) శుక్రవారం మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పెట్రో ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై (Petrol Price today Hyderabad) 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) రూ.109.33, డీజిల్ ధర రూ.102.38కి పెరిగింది.
- విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరిగింది. (Petrol Price in Vizag) దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.16, డీజిల్ ధర రూ.102.67కు చేరుకుంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 36 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.111.43, డీజిల్ రూ.103.89కు ఎగబాకింది.
ఇదీ చూడండి: 31ప్రతిపాదనలు.. రూ.3,345 కోట్ల పెట్టుబడికి డాట్ ఆమోదం