ETV Bharat / business

బంగారం మీద రుణాల వ‌డ్డీ రేట్లు- ఏ బ్యాంక్‌లో ఎంత‌? - NBFCS

బంగారు రుణాలు 7% నుండి ప్రారంభ‌మ‌వుతున్నాయి. బంగారు రుణాల‌కు వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్‌కు ఒక్కోలా ఉంటాయి. సాధార‌ణంగా బంగారం మార్కెట్ విలువ‌లో.. 75% మించ‌ని రుణ మొత్తాన్ని అందిస్తారు. దేశంలోని కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) సంస్థ‌లు ప్ర‌స్తుతం అందిస్తున్న బంగారు రుణాల‌పై అమ‌లు చేసే వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

gold loan intrest rates in different banks
బంగారం మీద రుణాల వ‌డ్డీ రేట్లు
author img

By

Published : Jun 5, 2021, 2:01 PM IST

బంగారు రుణాలు 7% నుండి ప్రారంభ‌మ‌వుతున్నాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బంగారం బ్యాంకుల వ‌ద్ద త‌న‌ఖా పెట్టి రుణాలు తీసుకోవ‌డం పాత కాలం నుంచి జ‌రుగుతున్న‌దే. బంగారం విలువైన గ్యారంటీ త‌న‌ఖా వ‌స్తువు కాబ‌ట్టి రుణం కూడా వేగంగా మంజూర‌వుతుంది. త‌న‌ఖా పెట్టిన బంగారాన్ని త‌మ స్వాధీనంలో ఉంచుకోవ‌డం బ్యాంకుల‌కు చాలా సుల‌భం కూడా. బంగారు రుణాలు మ‌న దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫైనాన్సింగ్ సౌక‌ర్యాల‌లో ఒక‌టి. బంగారం తాక‌ట్టు పెట్టి రుణం తీసుకునేట‌ప్పుడు క్రెడిట్ స్కోర్ త‌క్కువున్నా ఇబ్బందేమీ లేదు. బంగారంతో రుణాల వ‌డ్డీ.. ప‌ర్స‌న‌ల్ లోన్ వ‌డ్డీకంటే త‌క్కువే ఉంటుంది. బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా రుణ మంజూరు చేస్తాయి.

సాధార‌ణంగా బంగారం మార్కెట్ విలువ‌లో 75% మించ‌ని రుణ మొత్తాన్ని అందిస్తారు. బంగారు రుణాల‌కి బ్యాంక్‌కు, బ్యాంక్‌కు వ‌డ్డీ రేట్లు మారుతుంటాయి. వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజ‌ర్ మ‌రియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆల‌స్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధ‌ర‌ఖాస్తు సౌల‌భ్యం మొద‌లైన వాటి కోసం త‌నిఖీ చేసుకోవాలి.

దేశంలోని కొన్ని ప్ర‌ముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్) సంస్థ‌లు ప్ర‌స్తుతం అందిస్తున్న బంగారు రుణాల‌పై అమ‌లు చేసే వ‌డ్డీ రేట్లు ఈ క్రింది టేబుల్‌లో ఉన్నాయి.

2 సంవ‌త్స‌రాల కాలానికి, రూ. 1 ల‌క్ష‌ రుణానికి సూచించే టేబుల్‌.

gold loan intrest rates
వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు

జూన్ 1, 2021న సంబంధిత వెబ్‌సైట్ల నుండి సేక‌రించిన డేటా ఇది. వ‌డ్డీ రేటు ఆధారంగా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థ‌ల డేటాను ఒక క్ర‌మంలో జాబితా చేయ‌బ‌డ్డాయి. 2 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో రూ. 1 ల‌క్ష బంగారు రుణం కోసం ప‌ట్టిక‌లో పేర్కొన్న వ‌డ్డీ రేటు ఆధారంగా సూచిక `ఈఎమ్ఐ`లు లెక్కించ‌బ‌డ్డాయి. (ప్రాసెసింగ్ ఫీజు, ఇత‌ర ఛార్జీలు 'ఈఎమ్ఐ' లెక్కింపులో లేవు).

ఇదీ చదవండి:ఒడుదొడుకుల ట్రేడింగ్​- ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.