దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చినా దిగుమతుల్లో మాత్రం జోరు తగ్గలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు 35.5 శాతం పెరిగినట్లు వాణిజ్యశాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బంగారం దిగుమతుల విలువ రూ. 59వేల కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.80వేల కోట్లకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఏటా 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది భారత్. ఈ ఏడాది దిగుమతుల్లో ఫిబ్రవరి మినహా ప్రతినెలా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.