కార్ల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిన ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరత.. ఇప్పుడు గృహోపకరణాలపై కూడా పడిందని వర్పూల్ కార్ప్ చైనా విభాగం అధ్యక్షుడు జేసన్ ఆయ్ తెలిపారు. గిరాకీకి తగ్గట్లు కంపెనీలు సరఫరా చేయలేకపోవటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని చెప్పారు. చైనా నుంచి ఐరోపా, అమెరికా వంటి దేశాలకు చిప్ ఎగుమతులు దాదాపు 25 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు.
చైనాలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా దేశీయ డిమాండ్‌ను తీర్చాలని చెప్పిన జేసన్.. మరోవైపు విదేశీ ఆర్డర్లకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నట్లు తెలిపారు. నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులైన మైక్రోవేవ్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన మైక్రోకంట్రోలర్‌లను, సాధారణ ప్రాసెసర్‌లను భద్రపరచడానికి కంపెనీ చాలా ఇబ్బంది పడుతోందని వివరించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆర్డర్లు వస్తుండటం వల్ల కంపెనీలన్నీ వాటిని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనా.. క్వాల్కమ్ లాంటి చిప్ కంపెనీలు డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. డిసెంబరు చివర్లో ప్రారంభమైన చిప్ కొరత.. ఇటీవల టీవీలు, ఏసీలు, అప్‌డేటెడ్ మొబైళ్లు, గేమింగ్ డివైజ్‌లు ఇలా రకరకాల వస్తువుల కొనుగోలు ప్రారంభం కావడంతో మరింత ఎక్కువైంది. ఇదే క్రమంలో షియోమి కార్ప్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారుల ఖర్చులు కూడా పెరిగాయి.
ఇదీ చూడండి: కొత్త కారా.. కొన్నాళ్లు ఆగాల్సిందే