ETV Bharat / business

ఈపీఎఫ్​ఓ యూఏఎన్​ నెంబరు మర్చిపోయారా? అయితే ఇలా చేయండి! - ఈపీఎఫ్​ఓ యూఏఎన్​ నంబరు మర్చిపోతే ఏం చేయాలి

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్​ఓ కేటాయించే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఏఎన్) ఎంతో కీలకమైంది. ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారాలన్నా.. పాత ఖాతాలను రద్దు చేసుకోవాలన్నా.. యూఏఎన్​ ఎంతో ముఖ్యం. అయితే ఈ నెంబరును మర్చిపోతే.. తిరిగి పొందవచ్చా? అందుకు ఏం చేయాలి?

ఈపీఎఫ్​ఓ యూఏఎన్​  మర్చిపోతే
Forgot EPFO UAN
author img

By

Published : Oct 31, 2021, 1:35 PM IST

దేశంలోని ప్రతి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)​ చందాదారునికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ).. 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఏఎన్) కేటాయిస్తుంది. ఈ నెంబరు ద్వారానే ఖాతాదారులు తమ పీఎఫ్​ బ్యాలెన్స్, ఇతర ఈపీఎఫ్​​ వివరాలను తనిఖీ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం పని చేస్తున్న సంస్థ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్​ ఖాతాను సులభంగా ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్​ నెంబరు​తో పాత ఖాతాలను రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్​లైన్​ సేవలన్నీ పొందాలంటే ఉద్యోగులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.

ఇంత కీలకమైన యూఏఎన్​ నెంబరును ఉద్యోగులు ఒక్కోసారి మర్చిపోతుంటారు. ఏం చేయాలో తోచక కంగారు పడుతుంటారు. అయితే సింపుల్​గా ఆన్​లైన్​లోనే నెంబర్​ను పొందవచ్చు. ఎలా అంటే...

  • యూఏఎన్​ నెంబరు తెలుసుకోవడానికి ఈపీఎఫ్​ఓ అధికారిక ​​పోర్టల్‌ https://unifiedportal-mem.epfindia.gov.inను ఓపెన్​ చేయాలి. దానిలో 'నో యువర్​ యూఏఎన్​'పై క్లిక్ చేయాలి.
  • మీ ఈపీఎఫ్ఓ​ ఖాతాతో లింక్​ అయిన మొబైల్​ నెంబర్‌ను ఎంటర్​ చేయాలి. ఆపై ఇచ్చిన క్యాప్చా కోడ్​ను ఎంటర్​ చేయాలి.
  • అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్​ చేయాలి.
  • ఆ తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ తదితర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
  • చివరిగా వెరిఫికేషన్​ కోసం మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మెంబర్​ ఐడీ వివరాలను నమోదు చేయాలి.
  • తర్వాత వచ్చిన ఆప్షన్లలో షో మై యూఏఎన్​పై క్లిక్ చేయాలి.
  • వెంటనే స్క్రీన్​పై మీ యూఏఎన్​ నెంబరు కనిపిస్తుంది.

యూఏఎన్​ యాక్టివేట్ కాకపోతే ఇలా చేయండి

  1. ఈపీఎఫ్​ఓ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
  2. తర్వాత స్క్రీన్​పై కనిపించే 'యాక్టివేట్​ యూఏఎన్​' లింక్​పై క్లిక్​ చేయాలి.
  3. యూఏఎన్​​, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ కార్డ్‌ వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.
  4. మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్​ నెంబరు తదితర వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
  5. తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్​ చేయాలి.
  6. అనంతరం వివరాల ధ్రువీకరణ కోసం మీ రిజిస్టర్డ్​ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి.
  7. అనంతరం వ్యాలిడేట్​​ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్​ అకౌంట్​ వెంటనే యాక్టివేట్ అవుతుంది.
  8. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబరుకు పాస్‌వర్డ్ వస్తుంది.
  9. మీ పాస్‌వర్డ్, యూఏఎన్​ నెంబర్లతో మీ ఈపీఎఫ్​ఓ ​మెంబర్ పోర్టల్‌కి లాగిన్ అవ్వొచ్చు.

ఇదీ చూడండి: నవంబరు 1 నుంచి భారీ మార్పులు.. ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.