ETV Bharat / business

'ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్'​లో స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు - Flipkart Big Saving Days sale: Top deals on smartphones

ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్స్​ డేస్ సేల్​ కోసం ముస్తాబైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సరికొత్త స్మార్ట్​ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్​కార్ట్ ప్లస్ కస్టమర్లకు సోమవారం రాత్రి 8 గంటల నుంచే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.

Flipkart Big Saving Days sale:
ఫ్లిప్​కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్​లో స్మార్ట్​ఫోన్లపై అదిరే ఆఫర్లు
author img

By

Published : Jun 22, 2020, 8:33 PM IST

ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. బిగ్​ సేవింగ్స్ డేస్​ పేరిట ఈరోజు(సోమవారం) అర్ధరాత్రి నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది. జూన్ 23 నుంచి 27 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

ఈ బిగ్ సేవింగ్స్​ డేస్​లో అదిరిపోయే ఆఫర్లతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు సిద్ధమైంది ఫ్లిప్​కార్ట్. అందులో కొన్ని మీకోసం.

రూ. 42 వేల ఫోన్​.. రూ. 22 వేలకే!

శాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్​ఫోన్​ను రూ.21,999 ధరతో అందుబాటులో ఉంచింది. దీని అసలు ధర రూ. 41,999. సరికొత్త కెమెరాతో ఫోన్​ను రూపొందించింది శాంసంగ్. వెనక కెమెరాలనే సెల్ఫీ కోసం ఉపయోగించుకునేలా రొటేటింగ్ కెమెరాను తీర్చిదిద్దింది. క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 730జీ ప్రాసెసర్​తో ఫోన్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది.

రియల్​మి ఎక్స్​2 ప్రొ

రూ.29,999గా ఉన్న ఈ స్మార్ట్​ఫోన్ ధర బిగ్ సేవింగ్స్ ఆఫర్​లో భాగంగా రూ.25,999కే అందుబాటులోకి రానుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జీంగ్​ దీని ప్రత్యేకత.

ఫీచర్లు

  • 6జీబీ ర్యామ్
  • 64జీబీ మెమోరీ
  • స్నాప్​డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్
  • 64ఎంపీ నాలుగు కెమెరాలు
  • 4000ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్​మీ కే20 ప్రో

సాధారణంగా రూ.26,999 ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్​లో భాగంగా రూ.23,499కే అమ్మకానికి ఉంచింది ఫ్లిప్​కార్ట్. స్నాప్​డ్రాగన్ 855 ప్రాసెసర్, 20ఎంపీ పాప్​-అప్ సెల్ఫీ కెమెరాతో పాటు వెనకవైపు నాలుగు(48ఎంపీ+13ఎంపీ+8ఎంపీ) కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4000ఎంఏహెచ్.

వివో జడ్​1ఎక్స్

రూ.15 వేల లోపు బడ్జెట్​లో అద్బుతమైన స్మార్ట్​ఫోన్ కోసం వివో జడ్​1ఎక్స్ అందుబాటులో ఉంది. రూ. 16,990గా ఉండే ఈ స్మార్ట్​ఫోన్​ను రూ.14,990కే లభిస్తోంది.

ఫీచర్లు

  • 6జీబీ ర్యామ్, 64 జీబీ మెమోరీ
  • స్నాప్​డ్రాగన్ 712 చిప్​సెట్
  • సూపర్ అమోలెడ్ డిస్​ప్లే
  • వెనకవైపు మూడు కెమెరాలు
  • 22.5వాట్ ఫాస్ట్​ ఛార్జింగ్​తో 4,500 ఎంఏహెచ్​ సామర్థ్యం

ఐక్యూఓఓ 3

ఫ్లిప్​కార్ట్ ఆఫర్​లో ఉన్న గేమింగ్ ఫోన్లలో ఉత్తమమైన 'ఐక్యూఓఓ 3'ని రూ.32,990కి అందుబాటులో ఉంచింది ఫ్లిప్​కార్ట్​. ఈ మొబైల్​పై(అసలు ధర రూ. 34,990) రూ. రెండు వేల డిస్కౌంట్​ ప్రకటించింది.

ఫీచర్లు

  • 8జీబీ ర్యామ్, 128జీబీ మెమోరీ
  • సూపర్ అమోలెడ్ ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్
  • వెనకవైపు నాలుగు కెమెరాలు
  • 4440ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం
  • 55వాట్ ఫాస్ట్ ఛార్జీంగ్ సౌలభ్యం
  • గేమింగ్​ కోసం టచ్​ బటన్స్​

పోకో ఎక్స్​2

రూ.17,499 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉంది. తొలుత రూ. 15,999కే ఫోన్​ను తీసుకొచ్చినప్పటికీ.. జీఎస్​టీ రేట్ల పెంపుతో ఫోన్​ ధర పెరిగింది.

ఫీచర్లు

  • 6జీబీ ర్యామ్, 128జీబీ మెమోరీ
  • వెనకవైపు నాలుగు కెమెరాలు(64ఎంపీ,8ఎంపీ,2ఎంపీ,2ఎంపీ)
  • రెండు సెల్ఫీ కెమెరాలు
  • క్వాల్కమ్ 730జీ ప్రాసెసర్
  • 4500ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 27వాట్ ఫాస్ట్ ఛార్జింగ్

ఫ్లిప్​కార్ట్ ప్లస్ మెంబర్లకు ఇవాళ రాత్రి 8 నుంచే ఈ ఆఫర్లను పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్లతో పాటు బ్యాంకు డిస్కౌంట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. హెచ్​డీఎఫ్​ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం ఇన్​స్టంట్​ డిస్కౌంట్ లభించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.