కరోనా వైరస్‌తో తలెత్తిన సంక్షోభ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ఏర్పాట్లు చేసుకుంది. కంటైన్‌మెంట్ జోన్లలోని కార్యాలయాల మూసివేత, సిబ్బంది కొరత, అధిక పని భారం వంటివి తలెత్తినప్పటికీ సభ్యుల ఆన్‌లైన్ అభ్యర్థనలను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించేలా కొత్త విధానాన్ని చేపట్టింది.
దీని వల్ల భవిష్యనిధి, పింఛను, పాక్షిక ఉపసంహరణలు, క్లెయిమ్‌ల బదిలీకి సంబంధించి సభ్యుల అభ్యర్థనలను సంబంధిత భౌగోళిక పరిధికి చెందిన ప్రాంతీయ ఈపీఎఫ్‌ఓ కార్యాలయమే పరిష్కరించాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ మినహా మిగిలిన ప్రక్రియలను అన్నిటినీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల్లోనైనా పూర్తి చేయవచ్చని పేర్కొంది.
ఇదీ చూడండి: సంక్షోభంలో దాగిన అవకాశం.. కొవిడ్ నేర్పిన పది పాఠాలు!