ETV Bharat / business

డిసెంబరులో కొత్తగా 8.04లక్షల ఉద్యోగాలు!

author img

By

Published : Feb 21, 2021, 5:06 PM IST

2020 డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరినట్లు శ్రామిక మంత్రిత్వశాఖ పేర్కొంది. 2019 డిసెంబరుతో పోలిస్తే సంఘటిత రంగంలో 24 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది.

EPFO net new enrolments grows 24pc to 12.54 lakh in Dec
డిసెంబరులో కొత్తగా 8.04లక్షల ఉద్యోగాలు!

డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కాగా.. 4.5 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు. 2019 డిసెంబరుతో పోలిస్తే సంఘటిత రంగంలో 24 శాతం వృద్ధి నమోదైంది. ఇక నవంబరుతో పోలిస్తే 44 శాతం చేరికలు పెరిగాయి. కొవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020 ఏప్రిల్ నుంచి డిసెంబరు) 53.70 లక్షల మంది నికర చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం చేరికల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర కార్మిక శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

వయస్సుల వారీ విశ్లేషణ ప్రకారం.. డిసెంబరు 2020లో 22-25 మధ్య వయస్సు గల కొత్త చందాదారుల సంఖ్య నికరంగా 3.36 లక్షలుగా, 18-21 వయస్సు కేటగిరీలో 2.81 లక్షలుగా నమోదైంది. మొత్తం కొత్త చందాదారుల్లో 18-25 వయస్సు గల వారే 49.19 శాతం ఉండడం గమనార్హం. ఈ వర్గాన్ని కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న వారిగా పరిగణించవచ్చు.

ఈపీఎఫ్‌ఓ గణాంకాల ప్రకారం.. ఉపాధి కల్పనలో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి డిసెంబరులో కొత్తగా 29.12 లక్షల మంది నికర చందాదారులు చేరారు. పరిశ్రమల వారీగా చూస్తే సేవా నిపుణులకు అత్యధికంగా ఉపాధి లభించింది. ఇందులో ప్రధానంగా మానవ వనరుల ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉంటాయి. ఈ రంగం నుంచి మొత్తం 26.94 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు.

ఇదీ చూడండి: నెరవేరని 'ఒకే దేశం.. ఒకే పాలసీ' లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.