ETV Bharat / business

వాట్సాప్‌ వినియోగదారులపై సైబర్​ దాడి!

author img

By

Published : Apr 17, 2021, 4:45 PM IST

వాట్సాప్​ ఖాతాదారుల సమాచారం సైబర్​ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని సీఈఆర్​టీ హెచ్చరించింది. వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దారి మళ్లించే లోపాలను వాట్సాప్​, వాట్సాప్​ బిజినెస్​ యాప్​లలో గుర్తించినట్లు తెలిపింది.

weaknesses detected in WhatsApp, Cyber agency cautions
వాట్సప్‌ వినియోగదారులకు సీఆర్‌సీటీ హెచ్చరిక

వాట్సప్‌ వినియోగదారుల సమాచారం సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదముందని దేశ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఈఆర్​టీ) హెచ్చరించింది. వాట్సాప్‌, వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లలో వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని పక్కదారి పట్టించే సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు సీఈఆర్​టీ వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సైబర్‌ ముప్పునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.

వాట్సాప్‌ v2.21.4.18, వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ v2.21.32 వర్షన్‌లలో ఈ లోపాన్ని గుర్తించినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్​లో ఉన్న వాట్సాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సీఈఆర్​టీ సూచించింది.

ఇదీచూడండి: వాట్సప్‌ గోప్యతపై విచారణ.. మరో ధర్మాసనానికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.