ETV Bharat / business

27న డీబీఎస్​లో లక్ష్మీ విలాస్​ బ్యాంక్​ విలీనం - కేంద్ర కేబినెట్​

బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్షోభంలో ఉన్న లక్ష్మీ విలాస్​ బ్యాంక్​ను డీబీఎస్​లో విలీనం చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఎన్​ఐఐఎఫ్​ డెట్​ ప్లాట్​ఫామ్​లో రూ. 6వేల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. ఏటీపీలో ఏటీపీ ఆసియా పసిఫిక్​ ఎఫ్​డీఐను కూడా ఆమోదించింది.

Cabinet approves Rs 6,000 cr infustion in NIIF debt platform
ఎన్​ఐఐఎఫ్​​లో ఈక్విటీ పెట్టుబడులకు కేబినెట్​ ఆమోదం
author img

By

Published : Nov 25, 2020, 5:27 PM IST

Updated : Nov 25, 2020, 6:29 PM IST

నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్పాన్సర్ చేసిన ఎన్​ఐఐఎఫ్​ డెట్ ప్లాట్‌ఫామ్‌లో 6 వేల కోట్ల రూపాయల ఈక్విటీ పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా 6 వేల కోట్ల రూపాయలు ఈక్విటీగా ఎన్​ఐఐఎఫ్​లోకి పెట్టుబడి పెట్టాలని కేంద్రం గతంలో నిర్ణయించింది.

లక్ష్మీ విలాస్​ విలీనం..

సంక్షోభంలో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను.. డీబీఎస్​ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. 20 లక్షల మంది ఖాతాదారులు, 4 వేల మంది ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావడేకర్ తెలిపారు. ఖాతాదారులు డిపాజిట్లు ఉపసంహరించుకునే ఆంక్షలను తొలగించినట్లు పేర్కొన్నారు.

ఈ నెల 27 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ఆర్​బీఐ ప్రకటించింది.

ఏటీసీలో ఎఫ్​డీఐ...

ఏటీసీ టెలికామ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో ఏటీసీ ఆసియా పసిఫిక్​ ఎఫ్​డీఐ(వీదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా ఏటీసీలో ఏటీసీ ఆసియా పసిఫిక్ రూ. 5,417.2 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత టెలికామ్ రంగంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది అద్దం పడుతుందని జావడేకర్ వెల్లడించారు.

ఏటీసీలో ఇప్పటికే 86.36శాతం ఎఫ్​డీఐ అనుమతి ఉంది. కేబినెట్ తాజా ఆమోదంతో అది 98.68శాతానికి చేరింది.

ఇదీ చూడండి:- ఎన్​ఎస్​ఈ బాటలోనే బీఎస్​ఈ- కార్వీపై వేటు

Last Updated : Nov 25, 2020, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.