శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్లో కొన్ని నిత్యావసరాలు సహా.. దిగుమతి చేసుకొనే వస్తువులపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ముఖ్యంగా దిగుమతి ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ఫలితంగా.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. వంట నూనెలు, ఫ్యాన్లు, బల్లలు, పాదరక్షలు, వంట సామాగ్రి, బొమ్మలు, ఫర్నీచర్ వంటి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.
మరోవైపు ఆట వస్తువులు, న్యూస్ ప్రింట్, మైక్రోఫోన్‌లపై పన్నులు తగ్గించాలని అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇవి చౌక ధరకే లభ్యం కానున్నాయి.
ఖరీదుగా మారనున్న వస్తువుల జాబితా ఇదే..
⦁ వెన్న, నెయ్యి, వంట నూనె, పీనట్ బటర్
⦁ వే ప్రొటీన్, గోధుమ పిండి, మొక్కజొన్న, తీపి దుంప విత్తనాలు, బంగాళదుంప
⦁ చూయింగ్ గమ్, సోయా ఫైబర్, వేరు చేసిన సోయా ప్రొటీన్
⦁ వాల్నట్స్
⦁ పాద రక్షలు, షేవింగ్ పరికరాలు, హెయిర్ క్లిప్పర్, హెయిర్ కటింగ్ ఉపకరణాలు
⦁ వంట సామాన్లు, టేబుల్‌వేర్, వాటర్ ఫిల్టర్లు, గాజు వస్తువులు
⦁ పింగాణి, ఎరుపు పగడాలు, పచ్చలు, నీల మణి, రంగు రత్నాలు
⦁ ఇంటి తాళాలు, జల్లెడ, దువ్వెన, హెయిర్ పిన్, కర్లింగ్ పిన్, కర్లింగ్ గ్రిప్
⦁ టేబుల్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు, పోర్టబుల్ బ్లోయర్స్
⦁ వాటర్ హీటర్లు, హెయిర్ డ్రైయర్లు, హ్యాండ్ డ్రైయింగ్ అప్పారేటస్, ఐరన్ బాక్స్‌లు
⦁ గ్రైండర్లు, ఓవెన్స్, కుక్కర్లు, కుకింగ్ ప్లేట్లు, గ్రిల్లర్స్, రోస్టర్లు, టోస్టర్లు
⦁ ఫర్నీచర్, విద్యుద్దీపాలు, బొమ్మలు, స్టేషనరీ వస్తువులు, కృత్రిమ పుష్పాలు, గంటలు, విగ్రహాలు, ట్రోఫీలు
⦁ మొబైల్ ఫోన్ పరికరాలైన డిస్ప్లే ప్యానెల్, టచ్ స్ర్క్రీన్
⦁ ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు, హుక్కా, పొగాకు, జర్దా వంటి వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
సుంకాలు తగ్గించిన వస్తువులు ఇవే...
⦁ మేలుజాతి గుర్రాలు
⦁ న్యూస్ ప్రింట్
⦁ ఆట సంబంధిత వస్తువులు
⦁ మైక్రోఫోన్
⦁ ఎలక్ట్రిక్ వాహనాలు