ETV Bharat / business

భారత్​లో 50 వేల తాత్కాలిక నియామకాలు: అమెజాన్​

లాక్​డౌన్​ నేపథ్యంలో భారత్​లో ఏర్పడ్డ డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 50వేల మంది తాత్కాలిక వర్కర్లను నియమించుకుంటామని అమెజాన్ సంస్థ వెల్లడించింది. ఆన్​లైన్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

amazon
అమెజాన్
author img

By

Published : May 23, 2020, 5:31 AM IST

భారత్‌లో లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చారు. షాపింగ్‌ మాల్స్‌ తెరిచేందుకు మాత్రం అనుమతి లేదు. దీంతో గత రెండు నెలలుగా ఆన్‌లైన్‌ షాపింగ్​కు భారీ డిమాండ్‌ ఏర్పడిందని ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 50వేల మంది తాత్కాలిక వర్కర్లను నియమించుకుంటామని సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది.

లాక్‌డౌన్‌ విధించిన తొలిరోజుల్లో ఈ-కామర్స్‌ సంస్థలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనంతరం ఇచ్చిన సడలింపులతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ మళ్లీ పుంజుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంలో ఆన్‌లైన్‌ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు అమెజాన్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అఖిల్‌ సక్సేనా వెల్లడించారు.

అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలతోపాటు డెలివరీ నెట్‌వర్క్‌లో తాత్కాలిక నియామకాలను చేపడతామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలతో భారత్‌లో పోటీని ఎదుర్కొంటోంది. ఇటీవలె అమెజాన్‌ భారత్‌లో ఫుడ్‌ డెలివరీ సేవలు కూడా ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.