ETV Bharat / business

ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ షురూ.! - ఎయిర్‌టెల్‌ 5జీ ప్లాన్స్ ధరలు

ఎయిర్‌టెల్ తన 5జీ నెట్‌వర్క్​కు సంబంధించిన పరీక్షలను ప్రారంభించింది. గురుగ్రామ్ సైబర్ హబ్ ప్రాంతంలో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్‌టెల్ 5జీ ఒక సెకనుకు కనీసం వన్​ జీబీ వేగంతో సమాచారం బదిలీ అయినట్లు నివేదికలు వెలువడ్డాయి.

airtel
ఎయిర్‌టెల్‌
author img

By

Published : Jun 15, 2021, 5:49 AM IST

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ట్రయల్స్‌ను ప్రారంభించింది. టెలికాం విభాగం (డాట్‌) అనుమతిచ్చిన నెల రోజులకే గురుగ్రామ్‌లోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో ఈ పరీక్షలను జరిపింది. డాట్‌ నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ట్రయల్స్‌ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. ట్రయల్స్‌ సందర్భంగా 1జీబీ వేగంతో డేటా బదిలీ అయినట్లు తెలిసింది. త్వరలో ఇదే తరహాలో ముంబయిలో సైతం ఎయిర్‌టెల్‌ పరీక్షలు నిర్వహించనుంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ టెలికాం సర్కిళ్లలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు డాట్‌ ఎయిర్‌టెల్‌కు అనుమతిచ్చింది.

ఇదీ చదవండి: తొలి 5జీ నెట్​వర్క్​ మొబైల్... వచ్చేసింది!

ఇదీ చదవండి: 1జీ నుంచి 5జీ వరకు- ప్రయాణం తెలుసా?

ఎయిర్‌టెల్‌తో పాటు జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ 5జీ ట్రయల్స్‌లో పాల్గొననున్నాయి. ఎయిర్‌టెల్‌ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌తో జట్టుకట్టి ఈ ప్రయోగాలు చేపడుతుండగా.. జియో 5జీ సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించనుంది. జియో సహా మిగిలిన సంస్థలు ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 5జీ పరీక్షలకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకునే సమయాన్ని కలుపుకొని మొత్తం ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్‌ కొనసాగనున్నాయి.

ఇవీ చదవండి: '5జీ రద్దు పిటిషన్‌ ఎందుకు వేశానంటే?'

5జీ గురించి ఆ వార్తల్లో నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.