ETV Bharat / business

Royal Enfield: రాయల్​ ఎన్​ఫీల్డ్​ గురించి మీకు ఈ విశేషాలు తెలుసా? - రాయల్​ ఎన్​ఫీల్డ్​ విశేషాలు

''బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా...డుగ్​ డుగ్​ బండి ఎక్కి'' సోషల్​ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట గురించి చర్చ. ఈ పాట వినగానే ముందుగా గుర్తొచ్చేది రాయల్​ ఎన్​ఫీల్డ్(Royal Enfield)​ బండి.. ఎందుకీ బండికింత క్రేజ్​? వరల్డ్​క్లాస్​ పాపులారిటీని పొందిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ గురించి తెలియని 10 విశేషాలు మీకోసం.

10 Things You Did Not Know About The Royal Enfield Motorcycles
రాయల్​ ఎన్​ఫీల్డ్​ గురించి మీకు ఈ విశేషాలు తెలుసా?
author img

By

Published : Aug 25, 2021, 3:14 PM IST

Updated : Aug 25, 2021, 5:34 PM IST

రాయల్​ ఎన్​ఫీల్డ్​​(Royal Enfield).. మోటార్​సైకిళ్ల తయారీ రంగంలో ఓ ప్రత్యేక ఒరవడిని సృష్టించిన బ్రాండ్​. బుల్లెట్(bullet)​, క్లాసిక్(classic)​, ఇంటర్​సెప్టర్(Royal Enfield Interceptor)​, కాంటినెంటల్​ జీటీ(Continental GT), మీటియర్​, హిమాలయన్​ వంటి మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని.. దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. విక్రయాల్లో వరల్డ్​క్లాస్​ బైక్​ మోడల్స్​ హార్లే-డేవిడ్​సన్(Harley-Davidson)​, ట్రయంఫ్​(Triumph Bike)తో పోటీ పడుతున్నాయి. బైకుల్లో రారాజుగా చెప్పుకునే రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్రేజ్​కు వెనుకున్న 10 విశేషాలను తెలుసుకుందాం.

భారతీయ బ్రాండ్​

10 Things You Did Not Know About The Royal Enfield Motorcycles
రాయల్​ ఎన్​ఫీల్డ్​

1901లో తండ్రికొడుకులు కలిసి రాయల్​ ఎన్​ఫీల్డ్​ బ్రాండ్ ప్రారంభించారు. వారిద్దరి పేర్లూ జార్జ్​ టౌన్సెండే​నే. అప్పటి వరకు టౌన్సెండ్​ కుటుంబం సూదులు తయారు చేసేది. ఈ క్రమంలో కుమారుడికి సైకిళ్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత 1901లో సైకిల్​కు 239-సీసీ ఇంజిన్​ను అమర్చి​.. తొలి బైక్​కు రూపకల్పన చేశారు.

సుదీర్ఘ కాలంలో ఈ మోటార్​ సైకిల్​ బ్రాండ్​ ఎంతోమంది యజమానుల చేతులు మారింది. ఈ క్రమంలో 1970 నాటికి యూకేలో ఈ బైక్​లకు​ డిమాండ్​ పడిపోయింది. భారత్​లో మాత్రం ఈ బ్రాండ్​కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బ్రాండ్​ను మన దేశంలోని ఐషర్​ మోటార్స్​ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడే తయారు చేసి.. ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం రాయల్​ ఎన్​ఫీల్డ్​ పూర్తిస్థాయి భారత​ బ్రాండ్​గా మారిపోయింది.

గన్​ మేకింగ్​ నుంచి ఆ బైక్​కు పేరు..

19వ శతాబ్దం చివర్లో.. 20వ శతాబ్దం ప్రారంభంలో.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ బ్రాండ్​ బర్మింగ్​హామ్​ స్మాల్​ ఆర్మ్స్​ కంపెనీ చేతిలో ఉండేది. ఆ తర్వాత రాలీ అనే సంస్థ హస్తగతం చేసుకుని బ్రాండ్​ను రాయల్​ స్మాల్​ ఆర్మ్స్​ ఫ్యాక్టరీలోనూ భాగం చేసింది.
ఈ సంస్థ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారు చేసేది. ఈ క్రమంలోనే క్రమంలో బైక్​కు బుల్లెట్​ అనే నామకరణం చేశారు. అలా 1931లో తొలి బుల్లెట్​ బైక్​ తయారైంది. ఇంకా అదే సంప్రదాయం కొనసాగుతోంది.

ఫిరంగి ఆకారంతో..

అసలైన రాయల్​ ఎన్​ఫీల్డ్​ లోగోలో ఫిరంగి ఉంటుంది. 'తుపాకీలా తయారైంది.. బుల్లెట్​లా దూసుకెళుతుంది' అనేది ఉపశీర్షిక. రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లను సరిగ్గా గమనిస్తే ఫిరంగిని పోలి ఉంటుంది.

మిలటరీ సేవలో..

రెండు ప్రపంచయుద్ధాల్లోనూ బ్రిటిష్​ ఆర్మీకి సేవలందించిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ.. ఇప్పటికీ ఆ సర్వీస్​లో కొనసాగుతోంది. భారత్​లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు ఇచ్చే మోటార్​సైకిళ్లలో ఎక్కువ భాగం రాయల్​ ఎన్​ఫీల్డ్​వే. పోలీస్​, మిలటరీ అధికారులు వీటిని అత్యధికంగా వినియోగిస్తారు. ట్రాఫిక్​ పోలీసులు సైతం.. హై-స్పీడ్​ ఛేజింగ్​ల కోసం ఉపయోగిస్తున్నారు.

డీజిల్​ ఇంజిన్​తో..

1970ల్లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ 650సీసీ, 700సీసీలతో పాటు 1000సీసీ ఇంజిన్​ కెపాసిటీతోనూ భారత మార్కెట్​లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. కాకపోతే వాటి ఖరీదు చాలా ఎక్కువ. కాలక్రమంలో నిర్వహణలోపం వల్ల వాటి తయారీని నిలిపివేశారు.

డీజిల్​ ఇంజిన్​తోనూ ఓ వెర్షన్​ను విడుదల చేశారు. 325సీసీ ఇంజిన్​ కెపాసిటీతో ఒక గాలన్​ ఇంధనానికి (ఒక గాలన్​= 3.78541 లీటర్లు) సుమారు 265 కిలోమీటర్ల మైలేజీ ఆ బైక్​ ఇచ్చేది.

నిరంతర ఉత్పత్తి

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హార్లే-డేవిడ్​సన్​, ట్రయంఫ్​ మోటార్​ సైకిళ్ల ఉత్పత్తిని మార్కెట్లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ అధిగమించింది. 1901లో ప్రారంభమైన ఈ బైక్​ల ఉత్పత్తి.. ఎన్నో ఒడుదొడుకులు వచ్చినా.. నేటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది.

హార్లే-డేవిడ్​సన్​ను దాటేసి..

2014లో ప్రపంచవ్యాప్తంగా హార్లే-డేవిడ్​సన్​ 2,67,000 మోటార్​సైకిళ్లను విక్రయించగా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​లు 3 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.

కరోనా సంక్షోభంలోనూ..

గతేడాది కరోనా సంక్షోభంలోనూ రాయల్​ ఎన్​ఫీల్డ్​ మోటార్​సైకిళ్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఒకప్పుడు రాయల్​ ఎన్​ఫీల్డ్​ అంటే '' అదేంటి...బైకేనా '' అని చూసే అమెరికన్లలోనే క్రేజ్​ విపరీతంగా పెరిగిపోయింది. 2020 ఏప్రిల్​లో భారత్​లో కంటే ఉత్తర అమెరికాలోనే ఎక్కువ అమ్మకాలు జరగడమే ఇందుకు నిదర్శనం.

పాతకాలపు ఆకారమే కానీ..

రాయల్​ ఎన్​ఫీల్డ్​కు సంబంధించిన పాతకాలపు రూపాన్ని వారసత్వంగా ఆ సంస్థ కొనసాగిస్తోంది. గతంలో ఈ మోటార్​సైకిల్​ విడిభాగాలను చేతులతోనే అసెంబుల్​ చేసేవారు. అయితే మారిన కాలానుగుణంగా ఇప్పుడు యంత్రాల ద్వారా ఆ పని చేయిస్తున్నారు.

కాని ఇంధన ట్యాంక్​పై ఉండే రాయల్​ ఎన్​ఫీల్డ్​ అన్న స్ట్రిప్​ని మాత్రం ఇప్పటికీ చేతితోనే వేస్తారు. మనదేశంలోని ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ పని చేస్తున్నారు.

చౌకగా..

ఈ కేటగిరీలోని ఇతర బ్రాండ్​లతో పోలిస్తే రాయల్​ ఎన్​ఫీల్డ్​ మార్కెట్లో చౌకగా లభిస్తున్నట్లే లెక్క. అతిపెద్ద ఇంజిన్​ కెపాసిటీ 650సీసీ కలిగిన కాంటినెంటల్​ జీటీ, ఇంటర్​సెప్టర్​ వేరియంట్లు కేవలం రూ.4.45 లక్షలకు లభిస్తుండగా.. హిమాలయన్​ మోడల్​ రూ.3.71 లక్షలకే వినియోగదారులకు అందుబాటులో ఉంది.

మెయింటెనెన్స్​, రిపేర్​ ఖర్చు కూడా చౌకే. మొత్తానికి విదేశీ బ్రాండ్లతో పోలిస్తే రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఉత్తమమని వినియోగదారులు భావిస్తున్నారు కాబట్టే ఏటికేడు అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది.

ఇదీ చూడండి.. రాయల్​ ఎన్​ఫీల్డ్ బైక్​ కొనాలనుకునే వారికి షాక్!

Last Updated : Aug 25, 2021, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.