ETV Bharat / briefs

ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్​... జూన్​ 3న ఓట్ల లెక్కింపు - ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్​... జూన్​ 3న ఓట్ల లెక్కింపు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు పోలింగ్​ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పలు కేంద్రాలలో వందశాతం పోలింగ్ నమోదైంది. వచ్చేనెల 3న కౌంటింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్​... జూన్​ 3న ఓట్ల లెక్కింపు
author img

By

Published : May 31, 2019, 10:41 PM IST

Updated : May 31, 2019, 11:29 PM IST

రంగారెడ్డి, వరంగల్​, నల్గొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. నల్గొండలో స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకొగా... మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్​ సాగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్​ మధ్యాహ్నం వరకు జోరందుకుంది. క్యాంపుల నుంచి వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా పొలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల అధికారులు పోలింగ్​ కేంద్రాలలో మంచినీరు, నడవలేని వారో కోనం వీల్ చైర్​లను ఏర్పాటు చేశారు. వివిధ పోలింగ్​ కేంద్రాల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా...పోలీసులు కట్టుదిట్టమైన భదత్రను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్​ కేంద్రాలను వివిధ పార్టీల అభ్యర్థులు సందర్శించి...పోలింగ్​ సరళిని పరిశీలించారు.

రంగారెడ్డి జిల్లాలో తెరాస అభ్యర్థి మాజీ మంత్రి పట్నం మహేందర్​ రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి పోటీ చేస్తున్నారు. నల్గొండలో తెరాస నుంచి తేరా చిన్నపరెడ్డి, హస్తం నేత కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో తెరాస నేత పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలో 98.88 శాతం, నల్గొండలో 98.80 శాతం , వరంగల్​లో 97.89 శాతం పోలింగ్​ నమోదైయింది. జూన్​ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్​... జూన్​ 3న ఓట్ల లెక్కింపు

ఇవీ చూడండి:'తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా'

Last Updated : May 31, 2019, 11:29 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.