అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాల్లోని తేమ తుపాను వైపు వెళ్లిపోవటం వల్ల రుతుపవనాల్లో చురుకుదనం మందగించిందని తెలిపింది. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించే వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...!
ఇవీ చూడండి: ఛార్జింగ్ బైక్ చిన్నదే... కానీ చేసే మేలెంతో..!