నేడు మొహాలీ వేదికగా ముంబయితో పంజాబ్ తలపడనుంది. బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచిన రోహిత్ సేన... ఫుల్ జోష్‌లో ఉంది. కోల్‌కతా చేతిలో ఓడిన పంజాబ్..పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై ఆడుతుండటం పంజాబ్ జట్టుకు కలిసొచ్చే అంశం.
మొదటి మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదం.. గెలవాల్సిన రెండో పోరులో రసెల్ విధ్వంసంతో ఓడిపోవడం పంజాబ్‌ను ఆలోచనలో పడేసింది. మొహాలీ వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్‌లో గెలవాలని గట్టిగానే ప్రాక్టీసు చేస్తోంది.
#SaddaAkhada is #VIVOIPL 2019 ready! Are you? 🤩 #SaddaPunjab #KXIPvMI pic.twitter.com/5pAar2emvM
— Kings XI Punjab (@lionsdenkxip) March 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SaddaAkhada is #VIVOIPL 2019 ready! Are you? 🤩 #SaddaPunjab #KXIPvMI pic.twitter.com/5pAar2emvM
— Kings XI Punjab (@lionsdenkxip) March 29, 2019#SaddaAkhada is #VIVOIPL 2019 ready! Are you? 🤩 #SaddaPunjab #KXIPvMI pic.twitter.com/5pAar2emvM
— Kings XI Punjab (@lionsdenkxip) March 29, 2019
ఇప్పటికే ఇరుజట్లు చెరో విజయాన్ని దక్కించుకున్నాయి. రెండో గెలుపుపై దృష్టి సారించాయి.
గేల్, సర్ఫరాజ్, మిల్లర్, మయాంక్ అగర్వాల్ ఫామ్‌లో ఉండటం పంజాబ్ జట్టుకు కలిసిరానుంది.
బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్..మెరవాల్సిన అవసరముంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో విఫలమైన కింగ్స్ బౌలర్లు..ఈ మ్యాచ్‌లో ఏం చేస్తారో చూడాలి.
బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరగులు చేసి కొద్దిలో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో వచ్చిన హార్దిక్ 14 బంతుల్లో32 పరుగులతో ఆకట్టుకున్నాడు.
గత మ్యాచ్‌లో ఒకే ఓవరులో మూడు సిక్స్‌లు కొట్టి అలరించిన యువరాజ్ ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
Punjab da real King is in his home town 👑💙🙌#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #KXIPvMI @YUVSTRONG12 pic.twitter.com/qB4vI5L93N
— Mumbai Indians (@mipaltan) March 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Punjab da real King is in his home town 👑💙🙌#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #KXIPvMI @YUVSTRONG12 pic.twitter.com/qB4vI5L93N
— Mumbai Indians (@mipaltan) March 29, 2019Punjab da real King is in his home town 👑💙🙌#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #KXIPvMI @YUVSTRONG12 pic.twitter.com/qB4vI5L93N
— Mumbai Indians (@mipaltan) March 29, 2019
గాయం నుంచి కోలుకుని గత మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్న బుమ్రాతో పాటు పేసర్లు మలింగ, మెక్లనెగన్, స్పిన్నర్ మాయంక్ మార్కండే వికెట్ల వేటకు రెడీ అవుతున్నారు.
జట్ల (అంచనా)
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మయాంక్ మార్కండే, మెక్లెనగన్, పొలార్డ్, యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, మలింగ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), సామ్ కర్రాన్, మహ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్‌గేల్, కే ఎల్ రాహుల్, అంకిత్ రాజ్‌పుత్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్
ఇవీ చదవండి:
- భారత మహిళా క్రికెటర్ల టీ20 ర్యాంకులు పదిలం
- మరో స్టువర్ట్ బ్రాడ్ అయ్యేవాడినే: చాహల్
- ఐపీఎల్లో కోహ్లీ అరుదైన ఘనత