ETV Bharat / briefs

బోర్డు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలనేదే గ్లోబరీనాతో ఒప్పందం

సాఫ్ట్​వేర్ అభివృద్ధి చేసి.. బోర్డు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలనేది గ్లోబరీనాతో కుదుర్చుకున్న ఒప్పందమని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వివరించారు. ఈ సంస్థ ఇప్పటివరకు పలు యానివర్సిటీలు, కళాశాలలకు పరీక్షల నిర్వహణలో సాంకేతిక సేవలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

గ్లోబరీనాతో ఒప్పందం
author img

By

Published : May 2, 2019, 5:24 AM IST

Updated : May 2, 2019, 7:41 AM IST

ఇంటర్ బోర్డు

ప్రవేశాల నుంచి ఫలితాల వెల్లడి వరకు అవసరమైన సాఫ్ట్​వేర్ తయారు చేయాలని సీజీజీని కోరినప్పటికీ... స్పందన రాలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. సీజీజీ స్పందించకపోవడం వల్ల ఏజెన్సీ ఎంపిక కోసం ప్రభుత్వం అనుమతితో ఈ- ప్రొక్యూర్​మెంట్ టెండర్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. గ్లోబరీనా, మేగ్నటిక్ సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయన్నారు.

అధికారులతో కూడిన కమిటీ టెండర్లను పరిశీలించి... గ్లోబరీనాను ఖరారు చేసిందన్నారు. ఈ కమిటీలో ఐటీ శాఖ నుంచి కూడా ఓ సభ్యుడు ఉన్నారని అశోక్ పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత... ప్రభుత్వం అనుమతి తీసుకుని గ్లోబరీనాకు పని అప్పగించామన్నారు. మూడేళ్లలో 4 కోట్ల 35 లక్షల రూపాయలతో సాఫ్ట్​వేర్ అభివృద్ధి చేసి.. బోర్డు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలనేది గ్లోబరీనాతో ఒప్పందమని ఆయన వివరించారు. గ్లోబరీనా సంస్థ 18 యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు పరీక్షల నిర్వహణలో సాంకేతిక సేవలు అందించిందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాంపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద అగ్నిప్రమాదం

Intro:Body:Conclusion:
Last Updated : May 2, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.