రాష్ట్ర మంత్రిమండలి సమావేవం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను నెలాఖరు వరకు పొడిగించడం, రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ తీరుతెన్నులు, కరోనా కేసుల పెరుగుదల, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది