ముంబయి శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. లత కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తి.. మోదీ నివాళి - Lata Mangeshkar passes away
18:33 February 06
17:48 February 06
సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ భౌతికకాయం.. ముంబయిలోని శివాజీ పార్కుకు చేరుకుంది. ఆమె నివాసం నుంచి మొదలైన ఈ అంతిమయాత్రకు అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్కులో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ కూడా పాల్గొన్నారు. అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది
16:11 February 06
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ముంబయిలోని ఆమె నివాసం నుంచి మొదలైన ఈ అంతిమయాత్రకు అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ముంబయి శివాజీ పార్కులో లత అంత్యక్రియలు జరగనున్నాయి.
13:24 February 06
గాయని లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ఆమె నివాసం 'ప్రభుకుంజ్'కు తరలించారు. ఈ రోజు సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్కులో లత అంత్యక్రియలు జరగనున్నాయి.
13:15 February 06
లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో మోదీ
ప్రధాని మోదీ.. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4.15 గంటలకు మోదీ ముంబయి చేరుకోనున్నారు. అనంతరం లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులర్పిస్తారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ముంబయి శివాజీ పార్కులో లత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
11:13 February 06
అధికారిక లాంఛనాలతో..
అధికారిక లాంఛనాలతో ఈ సాయంత్రం లతా మంగేష్కర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12.30కి ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
వెంకయ్య సంతాపం..
లతా మంగేష్కర్ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. మంగేష్కర్ మృతి దేశానికి, సంగీత ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆమె పాటల్లో దేశ ఆశలు, ఆకాంక్షలు ప్రస్ఫుటమవుతాయన్నారు.
10:40 February 06
'లతా జీ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'
గాయని లతా మంగేష్కర్కు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ' భారత రత్న, లతా జీ సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి' అని ట్వీట్ చేశారు.
మోదీ దిగ్భ్రాంతి..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
ఆమె స్వరం అజరామరం..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆమె స్వరం అజరామరమన్నారు. అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని తెలిపారు.
'లతా మంగేష్కర్ ఇక లేరనే బాధాకరమైన వార్త తెలిసింది. ఎన్నో దశాబ్దాల పాటు ఆమె గొంతుక నిలిచిపోతుంది. ఆమె బంగారు స్వరం అజరామరం. ఆమె అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
09:54 February 06
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత
Lata mangeshkar died: భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతూ గత 29 రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు.
గడ్కరీ సంతాపం..
సింగర్ లతా మంగేష్కర్కు సంతాపం ప్రకటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆమె మృతి దేశానికి తీరని లోటన్నారు. ఎన్నో తరాల పాటు ఆమె పాటలు గుర్తుండిపోతాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రెండు రోజులు సంతాప దినాలు..
లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని అధికార వర్గాలు వెల్లడించాయి.
అమిత్ షా, నడ్డా సంతాపం..
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను మాటల్లో చెప్పలేమన్నారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగానూ నష్టాన్ని చేకూర్చుతుందని ట్వీట్ చేశారు.
భారత రత్న, గానకోకిల లతా మంగేష్కర్ జీ మృతి బాధాకరమని ట్వీట్ చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.