రాజస్థాన్ కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు(Rajasthan cabinet news). ఆదివారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ(Rajasthan cabinet reshuffle) జరగనున్న నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో భేటీ అయిన మంత్రులు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి రాజీనామాను గహ్లోత్ ఆమోదించారు. గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సహా మరో మంత్రులు హరీశ్ చౌదరీ, రఘు శర్మ రాజీనామా చేయడానికి తొలుత ముందుకొచ్చారు. ఈ మేరకు వారు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ తర్వాత మంత్రులందరూ రాజీనామా చేశారు. దోతస్రా, హరీశ్ చౌదరీ, శర్మ తాము రాసిన లేఖలో.. పార్టీ కోసం పని చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశం జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పాయి. రాజస్థాన్ గవర్నర్ నివాసంలో రేపు సాయంత్రం 4 గంటలకు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని పేర్కొన్నాయి.