Bodapati Sejal suicide attempt at Telangana Bhavan in Delhi : దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను దగ్గరలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్.. గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు.
- లైంగిక ఆరోపణలు... కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే రాజయ్య
- 'దుస్తులు లాగి ఛాతీని తాకేవాడు.. కోరిక తీరిస్తే వైద్య ఖర్చులు భరిస్తానన్నాడు'
ఇది విషయంపై రెండ్రోజుల క్రితం దిల్లీలోని మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ (HRC)ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని.. చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని అన్నారు. రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో వేడుకున్నారు.
Sejal allegations against MLA Durgam Chinnayya : గత కొంత కాలంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న శైజల్.. తాజాగా ఆమె పేరుతో ఓ లేఖ విడుదల కావడం కలకలం రేపుతోంది. అందులో "ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అతను అనుచరులు భీమా గౌడ్, చిల్లరపు సతీష్, కుమ్మర్తి పోచన్న, కొనంకి కార్తిక్‌లు నన్ను గత కొంత కాలంగా వేధిస్తున్నారు. అంతే కాకుండా నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నేను దిల్లీలో నిరసన చేయడానికి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి నన్ను వేధిస్తున్నారు. అసభ్య పదజాలంతో నన్ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాను. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడం లేదు సరికదా.. తిరిగి నాపై కేసులు పెట్టడానికి చూస్తున్నారు." అంటు లేఖలో రాసుకొచ్చారు. చివరగా 'నేను చనిపోతే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని' లేఖలో ప్రస్తవించారు.
ఇరువురి మధ్య వివాదం ఏంటి: ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ బెల్లంపల్లిలో తమ డెయిరీ స్థాపించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సాయం కోరినట్లు గతంలో ఆమె పేర్కొన్నారు. ఆయన సహాయంతో ప్లాంట్ నిర్మించిన తరువాత.. కంపెనీలో ఎమ్మెల్యేకు వాటా కావాలని కోరినట్లు ఆరోపించారు. దీనికి ఆమె నిరాకారించడంతో తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని శేజల్ పలుమార్లు విమర్శించారు.
దీనిపై గతంలో దుర్గం చిన్నయ్య సైతం స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కొందరు ఒక మహిళను ఉపయోగించుకొని తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక దళిత నాయకుడిగా తన ఎదుగుదలను చూడలేక... డబ్బున్న కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.
ఇవీ చదవండి: