ETV Bharat / bharat

ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం - అక్సెల్‌ సాయంతో హుస్సేన్‌భట్‌ ముష్కరుడిని పట్టుకున్న పోలీసులు

ఉగ్రవాదిని ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అక్సెల్ అనే శునకానికి ఆర్మీ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది.

sniper dog of army
అక్సెల్‌ అనే శునకానికి ఆర్మీ నివాళి
author img

By

Published : Aug 1, 2022, 7:41 AM IST

ఉగ్రవాది ఆచూకీ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించి, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అక్సెల్‌ అనే శునకానికి ఆర్మీ నివాళి అర్పించింది. ఓ మసీదుకు ముప్పు కలగకుండా నివారించిన 'ఆర్మీ 26 డాగ్‌ యూనిట్‌'కు చెందిన ఆ రెండేళ్ల శునకానికి బాధాతప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

sniper dog of army
.

అసలేం జరిగింది..
అది జమ్ముకశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని వానిగంబాలా ప్రాంతం. ఓ ఇంట్లో ఉగ్రవాది దాక్కున్నట్లు సమాచారం అందడంతో ఆర్మీ జవాన్లు, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఇంట్లో ముష్కరుడు ఎక్కడ నక్కి ఉన్నాడో తెలియదు. పైగా ఇంటికి 10 మీటర్ల దూరంలోనే ఓ మసీదు ఉంది. అలాంటి సున్నిత ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడితే పవిత్ర స్థలానికి నష్టం కలిగే ప్రమాదముంది. ఇప్పుడెలా అని అధికారులు ఆలోచిస్తుండగానే ఇంటి లోపలి నుంచి తూటాలు దూసుకొచ్చి ఓ జవానును, మరో పోలీసును గాయపర్చాయి. అధికారులు అక్సెల్‌ను రంగంలోకి దింపారు. ఉగ్రవాదులు ఏమూలన దాక్కున్నా వారి జాడను ఇట్టే పసిగట్టగలిగే నేర్పున్న జర్మన్‌ షెపర్డ్‌ జాతి శునకం అది. దాని శరీరానికి కెమెరా అమర్చి లక్ష్యాన్ని చూపించి వదిలారు. రెండేళ్ల ఆ జర్మన్‌ షెపర్డ్‌ బెదరకుండా ఇంటివైపు దూసుకెళ్లింది. లోపల ఉన్న ఉగ్రవాది కాల్పులకు దిగినా వెనకడుగు వేయలేదు. ఉగ్రవాది ఉన్న కచ్చితమైన స్థలాన్ని గుర్తించింది. ముష్కరుడి తూటాలకు గాయపడి విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచింది. శనివారం అక్సెల్‌ సాయంతో హుస్సేన్‌భట్‌ అనే ఆ ముష్కరుడి ఆచూకీ కనిపెట్టిన తర్వాత జవాన్లు అతణ్ని తుదముట్టించారు.

ఇవీ చదవండి: ఘోరం.. కరెంట్​ షాక్ తగిలి 10 మంది మృతి.. వ్యాన్​లోని డీజే సిస్టమ్​ వల్లే!

'ఆ డబ్బు నాది కాదు.. నాపై కుట్రలకు కాలానిదే సమాధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.