ETV Bharat / bharat

మాస్కు పెట్టుకోమన్న పోలీసుకు మహిళ చెంప దెబ్బ- కాల్పులు జరిపిన భర్త

Woman slapped police in Delhi: మాస్కు పెట్టుకోమని చెప్పినందుకు కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. చెంప మీద కొట్టి.. తుపాకీతో కాల్పులకు జరిపారు. దిల్లీలో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ఓ వ్యక్తి న్యాయవాది అని తెలుస్తోంది.

girl slapped police for saying wear mask
girl slapped police mask mandatory
author img

By

Published : Jan 9, 2022, 5:51 PM IST

Woman slapped police in Delhi: మాస్కు పెట్టుకోమని చెప్పిన పోలీసు చెంప చెళ్లుమనిపించింది ఓ మహిళ. దిల్లీలోని శహదారా జిల్లాలోని సీమాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

shot police for asking to wear mask

కారులో వచ్చిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి దిల్షద్ గార్డెన్ సమీపంలో ఆగారు. వీరిలో ఎవరూ మాస్కు ధరించలేదు. అదే సమయంలో గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. వీరిని మాస్కు పెట్టుకోవాలని సూచించారు. అంతమాత్రం దానికే కట్టలు తెంచుకున్న కోపంతో పోలీసుపై దాడి చేసింది ఓ మహిళ. కారులో ఉన్న మరో వ్యక్తి.. ఏకంగా తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు.

సీమాపురి స్టేషన్​కు సమాచారం పంపించగానే అదనపు పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో రిజిస్టర్ అయిన ఓ పిస్తోల్, 20 కాట్రిడ్జ్​లు, 5 షెల్​లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాముకు ముందు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

వీరంతా తూర్పు దిల్లీ ఆనంద్ విహార్ సమీపంలోని పట్​పర్​గంజ్​ ప్రాంతానికి చెందినవారని విచారణలో తేలింది. కాల్పులు జరిపిన వ్యక్తి వృత్తిరీత్యా న్యాయవాది అని పోలీసులు తెలిపారు. నంద్ నాగ్రి ప్రాంతంలోని జువెనైల్ జస్టిస్ బోర్డులో వెల్​ఫేర్ అధికారిగా పనిచేస్తున్నాడని చెప్పారు. ఘటన సమయంలో నిందితుడి భార్య, ఆమె చెల్లెలు కారులో ఉన్నారని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బుజ్జి ఏనుగును కాపాడబోతే గజరాజుల దాడి- ఊరంతా ధ్వంసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.