కేరళ కోజికోడ్‌లో ఓ మహిళపై పెంపుడు శునకాలు దాడి (Dog attack Kozhikode) చేసి తీవ్రంగా గాయపరిచాయి. థామరస్సరీ ప్రాంతంలో నివసించే ఫౌజియాపై శునకాలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ మహిళను కోజికోడ్ మెడికల్ కళాశాలలో చేర్పించారు.
రోషన్ అనే వ్యక్తి.. కావాలనే తన పెంపుడు కుక్కలను వదిలినట్లు (Dog attack Kozhikode) స్థానికులు ఆరోపించారు. ఫౌజియాపై దాడి చేస్తున్న సమయంలోనూ ఆలస్యంగా కాపాడేందుకు వచ్చాడని చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో.. రోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే ఒకరిపై..
కొద్దిరోజుల క్రితం కూడా రోషన్ శునకాలు ప్రభాకరన్ అనే వ్యక్తిపై దాడి (Dog attack Kozhikode) చేశాయి. తీవ్రంగా గాయాలు కావడం వల్ల మెడికల్ కళాశాలలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: దేవునికి పూజ చేసి.. హుండీ ఎత్తుకుని పరార్