ETV Bharat / bharat

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం - రైలులో మహిళపై అత్యాచారం

Woman Raped In Moving Train : కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారం చేశారు ఇద్దరు కామాంధులు. బాధితురాలి బిడ్డను రైలు నుంచి బయటకు పడేస్తామని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అసోంలో ఘటన జరిగింది.

woman-raped-raped-in-moving-train-by-youths-on-sifang-express-in-assam
కదులుతున్న రైలులో మహిళపై అత్యాాచారం
author img

By

Published : Aug 7, 2023, 12:54 PM IST

Updated : Aug 7, 2023, 9:50 PM IST

Woman Raped In Moving Train : చంటిబిడ్డతో కలిసి రైలు ప్రయాణం చేస్తున్న ఓ మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. బోగీలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలిని కట్టేసి.. ఆమె బిడ్డను రైలులో నుంచి బయటకు పడేస్తామని బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అసోంలోని గుహవాటి నుంచి బంగాల్​లోని అలీపుర్​ద్దార్​ వెళ్లే.. సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్​లో శనివారం ఈ ఘటన జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ తన బిడ్డతో పాటు అసోంలోని గుహవాటిలో శనివారం మధ్యాహ్నం సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలు ఫకీరాగ్రామ్​ వచ్చేసరిగా దాదాపు తోటి ప్రయాణికుంతా దిగిపోయారు. దీంతో మహిళ ప్రయాణిస్తున్న బోగీ దాదాపు ఖాళీ అయింది. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. అదే బోగీలో ప్రయాణిస్తున్న నిందితులు.. దాన్నే అదునుగా తీసుకుని మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డారు.

మొదట ఈ అఘాయిత్యంపై బాధిత మహిళ ప్రతిఘటించగా.. ఆమెను దారుణంగా కొట్టి కట్టేశారు నిందితులు. తమకు సహకరించకపోతే చిన్నారిని రైలు నుంచి బయటకు పడేస్తామని బెదిరించారు. రైలు అలీపుర్​ద్దార్​ జంక్షన్​కు వచ్చిన అనంతరం రైల్వే పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఘటన మొత్తాన్ని వారికి వివరించింది. వెంటనే ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టిన పోలీసులు... శనివారం రాత్రి నిందితులను అరెస్ట్​ చేశారు. వారిని అసోంలోని కోక్రాఝర్‌గఢ్​కు చెందిన అబ్దు (25), మొయినుల్ హక్ (26)గా గుర్తించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.

ప్రయాణికురాలిపై టీటీఈ అత్యాచారం.. కదులుతున్న రైలులో మరో వ్యక్తితో కలిసి..
కొద్ది రోజుల క్రితం కూడా కదులుతున్న రైలులో ప్రయాణికురాలి (33)పై సామూహిక అత్యాచారం జరిగింది. మరో వ్యక్తితో కలిసి రైల్వే టీటీఈ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మొదట మహిళను ఏసీ కోచ్​లోకి పంపించిన టీటీఈ.. అనంతరం తన సహచరునితో కలిసి అఘాయిత్యం చేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని సంభల్ జిల్లాలో సుబేదార్‌గంజ్ ఎక్స్‌ప్రెస్​లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనంతరం నిందితులను అరెస్ట్​ చేశారు.

అసెంబ్లీకి వెళ్లేందుకు భయపడుతున్న కుకీ ఎమ్మెల్యేలు.. సర్కార్​కు ఆ పార్టీ మద్దతు ఉపసంహరణ!

దోపిడీ చేసిన పోలీసులు.. వ్యాపారవేత్తను బెదిరించి రూ.కోటి లూటీ.. తనిఖీలు చేస్తూ..

Last Updated : Aug 7, 2023, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.