ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​​​- జడ్జీల ఇళ్ల నుంచే ధర్మాసనాలు

Virtual Hearing Supreme Court: కరోనా కేసుల పెరుగుదలతో వర్చువల్ విధానంలో విచారణ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. శుక్రవారం (జనవరి 7) నుంచి న్యాయమూర్తులు తమ సొంత కార్యాలయాల నుంచే విధులను నిర్వర్తిస్తారని సర్క్యులర్​లో పేర్కొంది.

Omicron Effect
ధర్మాసనం
author img

By

Published : Jan 7, 2022, 5:12 AM IST

Virtual Hearing Supreme Court: దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో శుక్రవారం నుంచి అన్ని రకాల కేసుల్లో విచారణను వర్చువల్లోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జనవరి 7 నుంచి న్యాయమూర్తులు తమ సొంత కార్యాలయాల నుంచే విధులను నిర్వర్తిస్తారని సర్క్యులర్​లో పేర్కొంది. చీఫ్ జస్టిస్ ఎన్​.వి.రమణ నేతృత్వం వహించిన ధర్మాసనం ఈ మేరకు గురువారం స్పష్టం చేసింది.

"దురదృష్టవశాత్తు కరోనా సమస్య మళ్లీ మొదలైంది. అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరో ఆరు వారాల వరకు భౌతిక పద్దతిలో విచారణ జరిపే పరిస్థితులు కనిపించడం లేదు."

-చీఫ్ జస్టిస్ ఎన్​.వి.రమణ

Omicron Effect: అత్యవసరమైన కేసులు, కొత్త అంశాలు, బెయిల్, స్టేలతో ముడిపడిన అంశాలు, నిర్బంధ కేసులు, తేదీ ఖరారు చేసిన వాటిని మాత్రమే ఈ నెల 10వ తేదీ నుంచి కోర్టుముందు లిస్ట్ చేయనున్నట్లు సుప్రీం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ విధానం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'మోదీ పంజాబ్ ఘటన'పైనే కేబినెట్ చర్చ.. విచారణకు త్రిసభ్య కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.