ETV Bharat / bharat

'వర్చువల్​ ర్యాలీలు, ఆన్​లైన్​ ఓటింగ్​ సాధ్యమేనా?'.. ఈసీకి హైకోర్టు ప్రశ్న - ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికలుట

virtual elections: కరోనా నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఉత్తరాఖండ్​ హైకోర్టు. వర్చువల్​గా ఎన్నికల ర్యాలీలు, ఆన్​లైన్​ ఓటింగ్​ కల్పించటం సాధ్యమేనా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. జనవరి 12లోపు స్పందించాలని ఆదేశించింది.

Uttarakhand High Court
ఉత్తరాఖండ్​ హైకోర్టు
author img

By

Published : Jan 6, 2022, 1:23 PM IST

virtual elections: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వర్చువల్​ ర్యాలీలు, ఆన్​లైన్​ ఓటింగ్​ సాధ్యమేనా అని భారత ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది ఉత్తరాఖండ్​ హైకోర్టు. ర్యాలీలతో పాటు ఆన్​లైన్​ విధానంలో ఓటింగ్​ సౌకర్యాలు కల్పించే అంశాల సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని సూచించింది.

కొవిడ్​-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రానున్న ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్​ సంజయ్​ కుమార్​ మిశ్ర, జస్టిస్​ ఎన్​ఎస్​ ధనిక్​ ధర్మాసనం. ఆన్​లైన్​ ఓటింగ్​ విధానంపై ఈసీని ప్రశ్నించింది.

ఎన్నికల ర్యాలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు కనుక్కోవటం లేదా నిషేధించే అంశం కోర్టులో పెండింగ్​లో ఉన్న సమయంలో రాష్ట్రంలో ర్యాలీలు చేపడుతున్నారని పిల్​లో పేర్కొన్నారు పిటిషనర్​. దెహ్రాదూన్​లో ప్రచారం సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కరోనా బారినపడ్డారని కోర్టుకు సూచించారు పిటిషనర్​ తరఫు న్యాయవాది శివ భట్​. ఎన్నికల ర్యాలీలు ప్రమాదకరంగా మారుతాయని, భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటం వల్ల ఒమిక్రాన్​ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.

ర్యాలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు, ఆన్​లైన్ ఓటింగ్​ కల్పించటంపై జనవరి 12వ తేదీలోపు స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది హైకోర్టు. విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

కేంద్ర ఆరోగ్య శాఖతో ఈసీ భేటీ- ఎన్నికల నిర్వహణపై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.