Viral Video Four Year Old Boy Rides Royal Enfield : సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత.. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోతోంది. ఈ క్రమంలో కొందరు చిన్నారుల పే..ద్ద టాలెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటివి చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వయసుకు మించి బుడతలు ప్రదర్శించే టాలెంట్‌కు మంత్రముగ్ధులు అవుతున్నారు. అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం నాలుగేళ్ల చిన్నారి.. ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను నడిపి, ఔరా అనిపించాడు!
Kerala Four Year Old Boy Rides Royal Enfield and RX100 Bikes : ఈ చిన్నారి ఎక్కడో బయటి ప్రాంతానికి చెందినవాడు కాదు. మన వాడే. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ చిచ్చరపిడుగు.. తన అసాధారణమైన మోటార్‌సైకిల్ రైడింగ్ నైపుణ్యంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. నాలుగేళ్ల పిల్లాడు సైకిల్ తొక్కేందుకు నానాపాట్లు పడుతుంటాడు. పడుతూ.. లేస్తూ.. కాళ్లకు దెబ్బలు తగిలించుకుంటూ.. సైకిల్ నేర్చుకోవడం వంటివి చేసే వయసు అది! కానీ.. ఈ బుడ్డోడు ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ 350 మోడల్‌ను నడిపేశాడు.
Viral Video : వారెవ్వా.. ఏం టాలెంట్రా బుడ్డోడా..! నెట్టింట వీడియో వైరల్..!
"tranz__moto_hub" అనే ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో ఈ వీడియోలు పోస్టు చేశారు. ఇందులో ఈ చిన్నారి చేస్తున్న అద్భుతమైన విన్యాసాలను అతని తండ్రి పోస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ సూపర్ టాలెంట్ చిన్నారి పేరు మాత్రం తెలియలేదు. ఈ వీడియోలో అతని తండ్రి కాస్త హెల్ప్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఇక "ఆగేదే లే" అన్నట్టుగా దూసుకెళ్లిపోయాడు ఆ బుడ్డోడు. రౌండ్ల మీద రౌండ్ల వేశాడు.
ఆ చిన్నోడికి బైక్ నేర్పించడానికి అతని తండ్రి ఎంచుకున్న చోటు కూడా చాలా చక్కగా ఉంది. సువిశాలమైన మైదానం కావడంతో.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాహనాలను నడపం తేలికైంది. అయితే.. ఆ బాలుడు కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాదు.. యమహా RX100ను కూడా నడిపాడు. అంతేనా..? ఇంకా వివిధ మోటార్ సైకిళ్లను రయ్య్య్మనిపించాడు. ఎలాంటి బెరుకూ లేకుండా.. ఆ చిన్నారి వాహనాలను నడిపిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నరు.
ఈ వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకం.. ఆ చిన్నారి వెన్నుతట్టి తండ్రి ప్రోత్సహిస్తున్న తీరు ఎంతో బాగుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పట్నుంచే ఇలా బైక్‌లు నడిపితే.. పెద్దయ్యాక రేసర్ ఖచ్చితంగా అవుతాడు అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. రన్.. రన్.. బైకులతో మొదలు పెట్టి.. విమానాల దాకా దూసుకెళ్లాలి చిన్నోడా.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి తనదైన రైడింగ్‌తో చిన్నోడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.