కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణీకులు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ నివేదిక సమర్పించాలనే నిబంధనను తొలగించడంపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. ప్రయాణికుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం అని తెలిపారు.
" కరోనా టీకా రెండు డోసులు పొందిన వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక అవసరం లేకుండానే విమాన ప్రయాణానికి అనుమతించే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది."
- హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమానయాన శాఖ మంత్రి
అయితే ఈ నిర్ణయం విమానయాన శాఖ మాత్రమే తీసుకునేది కాదని.. హర్దీప్సింగ్ పూరీ తెలిపారు. ఆరోగ్య నిపుణులతో సహా.. ఇతర నోడల్ ఏజెన్సీలు ప్రయాణీకుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేస్తాయన్నారు.
ప్రస్తుతం.. కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు దేశీయ ప్రయాణీకులను ఆర్టీ-పీసీఆర్ నివేదికను తప్పనిసరి చేశాయి. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి.. రాష్ట్రాలకు ఆ హక్కు ఉందని పూరీ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: హిందీ, ప్రాంతీయ భాషల్లోనూ 'కోవిన్' సేవలు