ETV Bharat / bharat

హైవేపై కారులో వెళ్తూ గ్యాంగ్​రేప్.. ఎస్సై కావాల్సిన యువతిపై... - uttar pradesh rape news

ఎస్సై ఉద్యోగం కోసం రాత పరీక్షకు హాజరై వస్తున్న ఓ యువతిపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఫేస్​బుక్​లో పరిచయమైన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

gang rape
గ్యాంగ్​రేప్
author img

By

Published : Nov 25, 2021, 2:34 PM IST

Updated : Nov 25, 2021, 5:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కదులుతున్న కారులో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం (uttar pradesh rape news) కలకలం సృష్టించింది. ఆగ్రా-దిల్లీ హైవేపై(agra delhi expressway) ఈ దారుణం జరిగింది. బాధిత యువతి ఎస్సై పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆమె కుటుంబం కోసికల ఠాణాలో ఫిర్యాదు చేయగా.. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్‌ పరిచయం.. నమ్మించి మోసం..

బాధిత యువతికి.. హరియాణాలోని పాల్వాల్​కు చెందిన తేజ్​వీర్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. కొన్నాళ్ల స్నేహం తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తాను ఆగ్రాలో ఎస్సై రాత పరీక్షకు(up police recruitment 2021) హాజరవుతున్నట్లు యువతి చెప్పింది. దీనిని అదనుగా భావించిన ఆ యువకుడు.. తానూ వస్తున్నానని తెలిపాడు. మంగళవారం ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయలుదేరి ఆమె వద్దకు చేరుకున్నాడు. ఆమె వద్దని వారించినప్పటికీ ఇంటి వద్ద దింపుతానని.. తాను వచ్చేవరకు వేచిచూడాలని తనను బలవంతం చేశాడు.

దీనితో చేసేదిలేక సదరు యువకుడు వచ్చేవరకు బాధిత యువతి వేచి ఉంది. చివరకు ఆమెను కలుసుకున్న తేజ్​వీర్.. మత్తు మందిచ్చి కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేశాడు. అతని స్నేహితులు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె(up rape victim latest news) స్పృహ తప్పి పడిపోగానే ఆగ్రా-దిల్లీ హైవే పక్కన వదిలేసి వెళ్లిపోయారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. బుధవారం కోసికల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఘటనపై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ ఎస్పీ డాక్టర్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. 'ప్రధాన నిందితుడిని గురువారం తెల్లవారుజామున అరెస్ట్ చేశాం. మిగతా వారి కోసం గాలిస్తున్నాం. నిందితులు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నాం' అని వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 25, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.