ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్.. కరోనా బారిన పడ్డారు. వాస్తవానికి సోమవారం సాయంత్రం ఆయన దిల్లీ వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేబినెట్ మంత్రులతో సమావేశం కావాల్సి ఉంది.
ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన క్రమంలో ఆయన దిల్లీ ప్రయాణం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడటం.. ఆసక్తికరంగా మారింది.
రెండు రోజుల క్రితం మహిళ వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తీరథ్, ఆ తర్వాత భారత్‌ను 200 ఏళ్లు అమెరికా పాలించిందని వ్యాఖ్యానించారు. తాజాగా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ రేషన్ బియ్యం వచ్చేవని పేర్కొని విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇవీ చూడండి: ఉత్తరాఖండ్ సీఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు