వైద్య పరికరాలను బ్లాక్ మార్కెటింగ్ చేయటంపై మధ్యప్రదేశ్ సతానా జిల్లాలో కేసు నమోదైంది. వాడిన పీపీఈ కిట్లను శుభ్రం చేసి మళ్లీ విక్రయిస్తున్న ఓ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. బడ్ఖేరా గ్రామంలోని ఓ బయో వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్ ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం.
వేడీ నీళ్లతో ఉతికి..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులను శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేయాలి. కానీ, బడ్ఖేరాలోని ఈ ప్లాంట్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాడేసిన పీపీఈ కిట్లను డీకంపోజ్ చేయకుండా.. వేడి నీళ్లలో ఉతికి, మళ్లీ విక్రయించేందుకు ప్యాక్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ రాజేష్ సాహి తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: Covid-19: కరోనా చేసిన ఘోరం- బిడ్డలకు తల్లి లాలన దూరం
ఇదీ చూడండి: Corona tests: కొవిడ్ కట్టడిలో వ్యూహరాహిత్యం