ETV Bharat / bharat

3 రోజుల్లో పెళ్లి.. శుభలేఖలు ఇస్తుండగా యువతిపై గ్యాంగ్​రేప్​- ఆ పార్టీ నేతకు లింక్! - up acid attack

తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ యువతి ఆరోపించింది. తర్వాత నిందితులు తనను ఓ రాజకీయ పార్టీ నేత దగ్గరకు తీసుకెళ్లారని, మరో వ్యక్తితో కొన్ని రోజులు ఉండేలా బలవంతం చేశారని ఫిర్యాదు చేసింది. యూపీ ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

up gang rape victim news
3 రోజుల్లో పెళ్లి.. శుభలేఖలు ఇస్తుండగా యువతిపై గ్యాంగ్​రేప్​- ఆ పార్టీ నేతకు లింక్!
author img

By

Published : May 10, 2022, 8:03 AM IST

UP gang rape victim news: ఓ రాజకీయ పార్టీ నేతకు ముడిపెడుతూ 18 ఏళ్ల యువతి సామూహిక అత్యాచార ఆరోపణలు చేయడం ఉత్తర్​ప్రదేశ్​లో కలకలం రేపింది. తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు తనను ఎత్తుకెళ్లి, అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. యూపీ ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతికి ఏప్రిల్ 21న వివాహం జరగాల్సి ఉంది. ఏప్రిల్ 18న పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్తుండగా ఆమె గ్రామానికే చెందిన ముగ్గురు యువతిని ఎత్తుకెళ్లి, అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను కొన్నిరోజుల పాటు వేర్వేరు చోట్ల బంధించారు. అనంతరం ఓ రాజకీయ పార్టీ నేత దగ్గరకు తీసుకెళ్లి, కొన్నిరోజులు అక్కడే ఉంచారు. అక్కడి నుంచి బలవంతంగా పొరుగున ఉన్న మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని దతియా జిల్లాకు పంపి, ఓ వ్యక్తితో ఉండేలా చేశారు. ఎలాగోలా తండ్రికి ఫోన్​ చేసిన బాధితురాలు.. అసలు విషయం చెప్పింది. చివరకు పోలీసులు ఆమెను రక్షించారు.

"మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అపహరణ, అత్యాచారం, మహిళను విక్రయించడం అనే అభియోగాలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. మేజిస్ట్రేట్​ ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశాం. ముమ్మరంగా విచారణ సాగుతోంది. దోషులపై చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు తెహ్రౌలీ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ సింగ్.

కేసు వాపస్ తీసుకోవాలంటూ యాసిడ్ దాడి: యూపీలోనే మరో ఘోరం జరిగింది. తమ కుమార్తెపై రాజేశ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడన్న కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసేందుకు.. బాధితురాలి తల్లిదండ్రులపై ఐదుగురు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. పీలీభీత్ జిల్లాలో గజ్రౌలా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆదివారం నిద్రిస్తున్న దంపతులపై.. ఐదుగురు వచ్చి యాసిడ్ పోశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలి తల్లిదండ్రులు.. బరేలీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. లైంగిక వేధింపుల కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గజ్రౌలా స్టేషన్​లోని ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ దినేశ్ ప్రభు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.