Undertrial prisoner death: బిహార్ వైశాలి జిల్లాలోని హాజీపుర్ జైలులో దారుణం జరిగింది. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ జైలులో చనిపోయాడు. అయితే జైలు సిబ్బంది ఆ వ్యక్తి చేతికి సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకువచ్చారు.
చనిపోయిన ఆ వ్యక్తిని హాజీపుర్ లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్సలే గ్రామానికి చెందిన రాజ్‌కిశోర్ షాగా గుర్తించారు. ఫిబ్రవరి 16 నుంచి అతడు జైలులో ఉన్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణంగా రాజ్‌కిశోర్ మరణించినట్లు తెలుస్తోంది. అయితే షా అస్వస్థతకు గురయ్యాడనే నెపంతో జైలు అధికారులు అతనికి సంకెళ్లు వేసి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే.. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు స్పష్టం చేశారు.
షా ను ఆసుపత్రికి తరలించే సమయంలో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతను చనిపోయిన తరువాత మాత్రమే ఓ లేఖ రాసినట్లు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 12 మందికి అస్వస్థత