తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు ప్రముఖ నటుడు విజయ్ చెక్ పెట్టారు. తన పేరుతో నమోదైన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన కోసం ఆ పార్టీలో చేరవద్దని అభిమానులకు తెలిపారు విజయ్.
ఆ వార్తతో..
విజయ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 'అఖిల భారత తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్' ఫ్యాన్ క్లబ్ కూడా ఉంది. తాజాగా ఈ క్లబ్‌ను రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశారు విజయ్ తండ్రి, డైరక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్. ఈ వార్త సంచలనం సృష్టించింది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఈ పూర్తి వ్యవహారంపై విజయ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. తన కార్యకలాపాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
విజయ్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను చంద్రశేఖర్ కూడా ఖండించారు. క్లబ్ రిజిస్ట్రేషన్ వ్యవహారం పూర్తిగా తన చేతుల మీదుగానే జరిగిందని.. దీనితో విజయ్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.
విజయ్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:- అమర వీరులకు నివాళిగా 'భారత యాత్ర-2'