కళాకారులను రాజస్థాన్, చండీగఢ్ నుంచి రప్పించారు. ధౌలాపూర్ నుంచి ప్రత్యేక రాళ్లు తెప్పించారు. ఇదంతా కవి దర్బారు నిర్మాణం కోసం. పావోంటా సాహిబ్‌లోని చారిత్రక గురుద్వారాలో.. ప్రపంచంలోనే మొట్టమొదటి కవి దర్బార్ నిర్మాణం జరుగుతోంది. ఈ కట్టడం హిమాచల్ ప్రదేశ్‌కే తలమానికంగా నిలవనుంది.
"పావోంటా సాహిబ్‌లో గురుగ్రాంథ్ నాలుగున్నరేళ్లు ఉన్నప్పుడు ఎన్నో కవితా సంపుటాలు, మరెన్నో కవిత్వాలకు ఇక్కడే ప్రాణం పోశారు. గురు సాహిబ్ ఇక్కడ ప్రతి సాయంత్రం ఆసీనులయ్యేవారు. కవిదర్బారు తప్పకుండా నిర్వహించేవారు."
- అమనింద్ర సింగ్, బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అధ్యక్షుడు
"పావోంటా సాహిబ్‌లో నిర్మితమవుతున్న కవిదర్బారు కోసం రాజస్థాన్ నుంచి ప్రత్యేక రాయి తెప్పిస్తున్నారు. యమునా నది ఒడ్డునుంచి రాళ్ల సరఫరా జరుగుతోంది."
- కళాకారుడు
గురుగోవింద్ సింగ్‌జీ.. పావోంటా సాహిబ్ గురుద్వారాకు 1683లో శంకుస్థాపన చేసినట్లు చెప్తారు. ఆ సమయంలో గురుగోవింద్ సింగ్.. 52 మంది కవులతో కవిదర్బారు నిర్వహించేవారని చరిత్ర చెప్తోంది. అప్పటినుంచి ఆ 52 మంది కవులు ప్రతి ఏడాదీ తమ తమ రచనలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున కవిదర్బారు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో కవులు తరలి వస్తారు. ఇప్పటివరకు 320 కవి సమ్మేళనాలు నిర్వహించారు.
"రాజస్థాన్‌లోని మక్రానా నుంచి ఇక్కడికి పని కోసం నేను వచ్చాను. పావోంటా సాహిబ్‌లో పని చాలా బాగా జరుగుతుంది. నిర్మాణంలో వినియోగించేందుకు మక్రానా, ఢోల్‌పూర్ నుంచి రాయిని తెప్పించారు. ఇక్కడ నిర్మిస్తున్న భవనం ఇంకెక్కడా కనిపించదు."
- నూర్ హసన్, మేస్త్రీ
"పావోంటా సాహిబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పదవ రాజు కాలం నుంచీ కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. 10 వ రాజు దర్బారులో 52 మంది కవులు ఉండేవారు. ప్రస్తుతం వాళ్లంతా వివిధ భాషల్లో రాణిస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడున్నా.. రాజు నిర్వహించే కవి సమ్మేళనానికి తప్పనిసరిగా హాజరయేవారు. పద్యాలు చదివి వినిపించేవారు. కవితలు చెప్పేవారు. ఇక్కడ అదే సంప్రదాయం ప్రతి నెలా కొనసాగుతోంది."
- దలీప్ సింగ్ రాగి
"ప్రపంచంలో ఇలాంటి కవి దర్బారు ఇంకెక్కడా లేదని చెప్తారు. పావోంటా సాహిబ్‌లో నిర్మిస్తున్న మొట్టమొదటి కవి దర్బారు అత్యంత సుందరంగా నిర్మించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. నిర్మాణరంగ నిపుణులనే కాదు.. ప్రత్యేక రాళ్లను తెప్పించి, పెద్దఎత్తున నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా.. గురుద్వారా ప్రాంగణంలో 52 రకాల పూలమొక్కలను నాటారు. త్వరలోనే కవిదర్బారు భవన నిర్మాణం పూర్తికానుంది.
"దీన్ని అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. కళ్లు చెదిరే అందం ఈ భవనం సొంతం. ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ గురుద్వారాను ఒక్కసారి సందర్శిస్తే.. ఆ అనుభూతిని జీవితాతం మర్చిపోలేరు."
- హర్భజన్ సింగ్, గురుద్వారా కమిటీ ఉపాధ్యక్షుడు
"గురుద్వారా పావోంటా సాహిబ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. గురు సాహిబ్ నగరంలో నివాసం ఏర్పరచుకున్న తర్వాత మొట్టమొదటి కవి దర్బార్ నిర్వహించారు. అప్పటినుంచి ఈ సమ్మేళనాలు జరుగుతున్నాయి."
- జగ్‌బీర్ సింగ్, మేనేజర్
ఈ గురుద్వారాను దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచే పర్యటకులు వస్తారు. వారిని దృష్టిలో ఉంచుకుని, కవి దర్బార్‌ను అత్యంత విశేషంగా నిర్మిస్తున్నారు. ఈ భవనం నిర్మాణం పూర్తైన తర్వాత పర్యటకుల తాకిడి మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'