Constable blocked CM Jagan convoy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌కు తాడేపల్లిలో ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు. ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్‌కు కానిస్టేబుల్ అడ్డుపడగా.. విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి జగన్‌కి వినతి పత్రం ఇచ్చేందుకే తాను ప్రయత్నించినట్లు ఆ కానిస్టేబుల్ చెప్పినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్లే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తల్లి చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ మైదానంలో దిగిన ముఖ్యమంత్రి.. కాన్వాయ్ ద్వారా గిరిధర్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం మాతృవియోగం పొందిన గిరిధర్ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడి.. వారికి ఓదార్పునిచ్చారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుని.. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి తిరుగు పయనమయ్యారు.
ఈ క్రమంలో సీఎం జగన్ భద్రతా సిబ్బందితో తాడేపల్లికి విచ్చేస్తుండగా ఆయన కాన్వాయ్‌కి ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు. రిప్రజెంటేషన్ తీసుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. సీఎం కాన్వాయ్‌కు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని భద్రతా సిబ్బంది, పోలీసులు ఎందుకు అడ్డుపడ్డావని ప్రశ్నించగా.. తాను సీఎం జగన్‌కు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆ కానిస్టేబుల్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
మరోపక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. కలెక్టరేట్ జంక్షన్ నుంచి శ్యామలానగర్‌లోని గిరిధర్ ఇంటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. దీంతో అక్కడి ప్రజలు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం పర్యటన కారణంగా సామాన్య ప్రజలపై అధికారులు ఆంక్షలు విధించటంతో ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన భద్రతా సిబ్బందితో కలిసి తాడేపల్లికి విచ్చేస్తుండగా ఓ కానిస్టేబుల్ ఆయన కాన్వాయ్‌కి అడ్డుపడటం సంచలనంగా మారింది. అంతేకాదు, ఆ కానిస్టేబుల్ ఏ విషయంలో సీఎం జగన్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు..? అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి