కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది.
అయితే కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అధికారుల అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతిస్తారని స్పష్టంచేసింది డీజీసీఏ.
2020 మార్చి 23 నుంచి..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి నిలిపేసింది డీజీసీఏ. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది.
ఇదీ చూడండి: డ్రోన్లు వాడటం ఇక ఈజీ- కొత్త రూల్స్ ఇవే..