ETV Bharat / bharat

'బీబీసీ ఎపిసోడ్​ను ఎందుకు ప్రసారం చేయొద్దు?'.. కేంద్రానికి సుప్రీం నోటీసులు - Supreme Court Latest News On Collegium

2002 గుజరాత్​ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై ఒరిజనల్ రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

SC Judgement On BBC Documentary
బీబీసీ డాక్యుమెంటరీపై సుప్రీం తీర్పు
author img

By

Published : Feb 3, 2023, 6:22 PM IST

2002 గుజరాత్​ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రసారాన్ని ఎందుకు నిలిపేశారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ తదుపరి విచారణలోగా కోర్టుకు సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రముఖ జర్నలిస్ట్ ఎన్​ రామ్​, తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాదులు ప్రశాంత్​ భూషణ్​, ఎమ్​ఎల్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​లపై జస్టిస్​ సంజీవ్​ కన్నా, జస్టిస్​ ఎమ్​ఎమ్​ సుంద్రేశ్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేయాలని.. తదుపరి విచారణకు వచ్చే సమయానికి డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్​ రికార్డులను కోర్టుకు సమర్పించాలని నోటీసులో పేర్కొంది. కాగా, ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్​కు వాయిదా పడింది. అయితే తొలుత ఈ విషయంపై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్లను బెంచ్​ ప్రశ్నించింది.

అసలేంటి బీబీసీ డాక్యుమెంటరీ..?
2002లో గోద్రా ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రను విమర్శనాత్మకంగా చూపించింది బీబీసీ మీడియా సంస్థ. 'ఇండియా: ద మోదీ క్వశ్చన్​' పేరుతో రెండు ఎపిసోడ్​ల సిరీస్‌ను బీబీసీ రూపొందించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ప్రభుత్వం దీని ప్రసారంపై నిషేధం విధించింది. దీంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి దీనిని నిషేధించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు.

కొలీజియం సిఫార్సును క్లియర్​ చేస్తాం: కేంద్రం
మరోవైపు.. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులను త్వరలోనే ఆమోదిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. జస్టిస్​ ఎస్​కే కౌల్​, జస్టిస్ ఏఎస్​ ఓకాతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి కేంద్ర అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి ఈమేరకు వివరణ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించే కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల జాబితాను కేంద్రం పక్కకు పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సంబంధిత వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం గత ఏడాది డిసెంబరు 13న కేంద్రానికి సిఫార్సు చేసింది. వారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.