ETV Bharat / bharat

'ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ!'.. రైతు గుర్రాల బిజినెస్​.. రూ.లక్షల్లో సంపాదన

గుర్రాల వ్యాపారంతో ఓ రైతు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. వ్యవసాయానికి అనుబంధంగా స్టడ్​ ఫామ్​ నిర్వహిస్తూ లాభాలు పొందుతున్నాడు. స్టడ్​ ఫామ్​ల వల్ల చాలా తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయంటున్నాడు పంజాబ్​ బఠిండా జిల్లాకు చెందిన రైతు గుర్తేజ్​ సింగ్​. అదేలాగో తెలుసుకుందాం.

stud farm punjab
stud farm punjab
author img

By

Published : Mar 31, 2023, 8:30 AM IST

Updated : Mar 31, 2023, 11:40 AM IST

మన దేశ అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర. దాదాపు 140 కోట్ల మందికి ఆహారం అందించేది ఈ రంగమే. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాంటి రంగంలో చెమటోడ్చే రైతులు.. నీళ్లు లేకపోవడం, వాతావరణ మార్పుల, నకిలీ విత్తనాలు తదితర కారణాల వల్ల నష్టాల పాలవుతున్నారు. చాలా మంది అందులోంచి తేరుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ, ఓ రైతు మాత్రం భిన్నంగా ఆలోచించి తన ఆర్థిక స్థితి మెరుగుపరుచుకున్నాడు. వ్యవసాయానికి అనుబంధంగా స్టడ్​ ఫామ్​ను నిర్వహిస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతడే పంజాబ్​కు చెందిన రైతు గుర్తేజ్ సింగ్!

బఠిండా జిల్లాలోని నరువానా గ్రామానికి చెందిన రైతు గుర్తేజ్​ సింగ్​. గుర్తేజ్​ కూడా అందరిలాగే వ్యవసాయం చేసేవాడు. అందులో వచ్చే డబ్బులు అతడికి సరిపోలేదు. దీంత వ్యవసాయానికి అనుబంధంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో స్టడ్​ ఫామ్​ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. మొదట లక్షన్నర రూపాయలు ఖర్చు చేసి రెండు ఆడ గుర్రాలను తీసుకొచ్చాడు. వాటికి పుట్టిన పిల్లలను విక్రయించి క్రమంగా ఫామ్​ను పెంచాడు. గుర్రాలకు మంచి షెడ్లు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అతడి వద్ద 8 గుర్రాలు ఉన్నాయి.

'ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ!'.. రైతు గుర్రాల బిజినెస్​.. రూ.లక్షల్లో సంపాదన

ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ..
స్టడ్ ఫార్మింగ్ వ్యాపారంలో ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని రైతు గుర్తేజ్​ సింగ్ తెలిపాడు. రోజుకు ఒక్కో గుర్రానికి మేత ఖర్చు రూ.150 నుంచి 200 మాత్రమే అవుతుందని వెల్లడించాడు. గుర్రాలు శెనగలు, జీలకర్ర, నెయ్యి తింటాయని.. వీటిని రైతులే పండించవచ్చని పేర్కొన్నాడు. అయితే, పంజాబ్​లో ప్రతినెల గుర్రాల సంత జరుగుతుంది. అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ తన గుర్రాలను విక్రయిస్తాడు గుర్తేజ్​. ఇక్కడ ఒక్కో గుర్రం దాదాపు రూ. 15 నుంచి 20 లక్షల వరకు పలుకుతుంది. అయితే, వివిధ జాతులను బట్టి గుర్రాల ధర వేరుగా ఉంటుంది.

కాగా, గుర్రాలకు అంత సులభంగా రోగాలు రావని.. అదే స్టడ్​ ఫార్మింగ్​లో ఉన్న మంచి విషయమని గుర్తేజ్​ సింగ్ చెప్పాడు. గుర్రాలకు ఏ సమస్య వచ్చినా.. 20 నుంచి 25 నిమిషాల్లో ఫామ్​ చేరుకుని చికిత్స చేసే వైద్యులు చాలా మంది ఉన్నారని తెలిపాడు. గుర్రాలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటానని.. అందుకోసం సకాలంలో టీకాలు వేయిస్తానని వెల్లడించాడు. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రభుత్వం స్టడ్​ ఫార్మింగ్​కు కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని గుర్తేజ్​​ అన్నాడు. దీని వల్ల పంటలకే పరిమితం కాకుండా ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పాడు.

Last Updated : Mar 31, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.