వీధికుక్కల దాడిలో 12 సంవత్సరాల బాలిక మృతిచెందిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లాలో మంగళవారం జరిగింది. కొత్తిమీర కోసం పంటపొలాల్లోకి వెళ్తుండగా.. శునకాల సమూహం ఆమెపై దాడికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భయంకరమైన ఆ కుక్కల నుంచి ఎవ్వరూ బాలికను కాపాడలేకపోయినట్లు తెలిపారు. తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఈ ఘటనతో ఊళ్లో రోదనలు మిన్నంటాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ జైప్రకాశ్ యాదవ్.. మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు. వీధి కుక్కలను పట్టి.. దూరంగా వదిలేయాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆదేశించిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బిహార్‌లో కాంగ్రెస్ ఖాళీ- ఎన్డీఏలోకి ఎమ్మెల్యేలు!