ETV Bharat / bharat

ముంబయిలో హైస్పీడ్ వాటర్ ట్యాక్సీలు- 7గంటల జర్నీ 15 నిమిషాల్లోనే! - high speed water taxi

Water taxi in Mumbai: ముంబయిలో మెరుపు వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ వాటర్ ట్యాక్సీల సేవలు అతిత్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా నవీ ముంబయిలోని ప్రాంతాలను నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సంక్రాంతికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది.

water taxi in Mumbai, వాటర్ ట్యాక్సీలు
ముంబయిలో సూపర్​ స్పీడ్ వాటర్ ట్యాక్సీలు..
author img

By

Published : Jan 4, 2022, 1:04 PM IST

Updated : Jan 4, 2022, 3:39 PM IST

Water taxi in Mumbai: ముంబయి వాసుల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు సరికొత్త వాటర్​ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇకపై ముంబయి నుంచి నవీ ముంబయికి నిమిషాల వ్యవధిలోనే వెళ్లవచ్చు. దీంతో గంటల సమయం ఆదా అవుతుంది. నెరుల్​, బెలాపుర్​, జేఎన్​పీటీ, ఎలిఫాంటా కేవ్స్​కు పావుగంటలోనే మెరుపువేగంతో దూసుకుపోవచ్చు. ప్రస్తుతం ముంబయి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే గంటల సమయం పడుతోంది.

water taxi in Mumbai
ముంబయిలో హై​ స్పీడ్ వాటర్ ట్యాక్సీలు

సాగర్​మాలా కార్యక్రమంలో భాగంగా జలమార్గ ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. మొత్తం 12 మార్గాల్లో వాటర్​ ట్యాక్సీల సేవలను తీసుకొస్తోంది. కొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సంక్రాంతికే ఆయన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఈ షెడ్యూల్​కు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ముంబయి పోర్టు ట్రస్టు, మహారాష్ట్ర జలమార్గ బోర్డు, CIDCO ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇన్​ఫినిటీ హార్బర్ సర్వీసెస్​, వెస్ట్​ కోస్టు మరైన్​ సంస్థలు ఈ ట్యాక్సీలను ఆపరేట్ చేస్తాయి.

High speed water taxi news

ఇన్ఫినిటీ హార్బర్​ వద్ద ప్రస్తుతం 4 హై స్పీడ్​ వాటర్ ట్యాక్సీలున్నాయి. వీటికి వరుసగా 50, 40, 32, 20 సీటింగ్ సామర్థ్యం కలదు. వెస్ట్​కోస్ట్ మరైన్​ కంపెనీ వద్ద 7 వాటర్​ ట్యాక్సీలున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6, 10 సీటింగ్ సామర్థ్యం గల మరో రెండు ట్యాక్సీలను సిద్ధం చేస్తున్నారు.

water taxi in Mumbai
ముంబయిలో హై​ స్పీడ్ వాటర్ ట్యాక్సీలు

తమ వాటర్​ ట్యాక్సీ ఛార్జీలు రూ.150నుంచి ప్రారంభమవుతాయని ఇన్ఫినిటీ హార్బర్ కంపెనీకి చెందిన సోహైల్​ కజానీ తెలిపారు. ఈ హైస్పీడ్ వాటర్ ట్యాక్సీలు గంటకు 12-25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్లగలవు. ఫలితంగా ముంబయి వాసులకు సాధారణం 7 గంటలు పట్టే ప్రయాణ సమయం.. వీటి ద్వారా 15-17 నిమిషాలకే పరిమితం కానుంది. ఈ ట్యాక్సీల్లో సీసీటీవీలు, లైఫ్ జాకెట్ల వంటి సదుపాయాలు కలవు. ప్రయాణికులు ఆస్వాదించడానికి సంగీతం ఉంటుంది. మండుటెండల్లోనూ హాయిగా విహరించడానికి ఏసీ సదుపాయం ఉంది. రాత్రి 11గంటల వరకు వాటర్​ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. వర్షాకాలంలో ఇతర బోట్ల సేవలను నిలిపివేసినా.. ఈ​ ట్యాక్సీల సేవలు మాత్రం కొనసాగుతాయని కజానీ పేర్కొన్నారు.

water taxi in Mumbai
ముంబయిలో హై​ స్పీడ్ వాటర్ ట్యాక్సీలు

Water taxi charges

కొన్ని మార్గాల్లో ఛార్జీలు రూ.500నుంచి రూ.800 వరకు నిర్ణయించారు. మంత్లీ పాస్​ కావాలంటే రూ.11,000 చెల్లించాలి. ప్రతి గంటకు ఈ ట్యాక్సీ సేవలు ఉంటాయి. పాస్ ఉన్నవారు ఒకే మార్గంలో ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. అయితే గరిష్ఠంగా 200 మంత్లీ పాస్​లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముందుగా సంప్రదించిన వారికే ఇవి దక్కుతాయని నిర్వాహకులు తెలిపారు.

అలీబాగ్ నుంచి రేవస్​ వెళ్లే మార్గంలో మాత్రం 14 సీటర్​ వాటర్ ట్యాక్సీ ఛార్జీ రూ.1200గా ఉంది.

ఇదీ చదవండి: UP election Akhilesh Yadav: 'శ్రీకృష్ణుడు రోజూ నాతో మాట్లాడుతాడు'

Last Updated : Jan 4, 2022, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.