ETV Bharat / bharat

భారత ప్రధాన న్యాయమూర్తుల్లో 9 మంది దక్షిణాది వారే - భారత ప్రధాన న్యాయమూర్తులు

CJI NV RAMANA ఇంతవరకు 48 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. సీజేఐలుగా పనిచేసిన వారిలో 9 మంది దక్షిణాదికి చెందినవారున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా కర్ణాటకకు చెందిన నలుగురు సర్వోన్నత న్యాయస్థానానికి సారథ్యం వహించారు.

cji
సీజేఐ
author img

By

Published : Aug 27, 2022, 7:21 AM IST

CJI NV RAMANA: భారత ప్రధాన న్యాయమూర్తులు (సీజేఐ)గా పనిచేసిన వారిలో 9 మంది దక్షిణాదికి చెందినవారున్నారు. ఇంతవరకు 48 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా కర్ణాటకకు చెందిన నలుగురు సర్వోన్నత న్యాయస్థానానికి సారథ్యం వహించారు.

ఎవరెవరు?
తొలి సీజేఐ జస్టిస్‌ హెచ్‌.జె.కానియా మరణానంతరం అప్పట్లో సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్న తమిళనాడుకు చెందిన జస్టిస్‌ ఎం.పతంజలి శాస్త్రి 1951లో ఆ బాధ్యతలు చేపట్టారు. ఇదే రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ పి.సదాశివం 2013లో సర్వోన్నత న్యాయస్థానానికి సారథ్యం వహించారు.

  • 1966-67 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ సేవలందించారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1966 జూన్‌ 30న సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించారు.
    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. శుక్రవారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.
  • కర్ణాటకకు చెందిన జస్టిస్‌ ఈ.ఎస్‌.వెంకటరామయ్య, జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య, జస్టిస్‌ రాజేంద్రబాబు, జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్‌ వెంకటరామయ్య కుమార్తె జస్టిస్‌ బి.వి.నాగరత్న ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె 2027లో సర్వోన్నత న్యాయస్థానం సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తద్వారా తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఘనత ఆమెకు దక్కనుంది.
  • కేరళకు చెందిన జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లకు పైగా ఆయన ఈ పదవిలో ఉన్నారు. తొలి దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఘనత సాధించిన జస్టిస్‌ బాలకృష్ణన్‌ ప్రస్థానం ఆసక్తికరం. కేరళ జుడీషియల్‌ సర్వీస్‌లో మున్సిఫ్‌గా ఎంపికైన ఆయన కొద్దికాలం తరవాత రాజీనామా చేసి కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అనంతరం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరవాత గుజరాత్‌, మద్రాస్‌ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

సుదీర్ఘకాలం సర్వోన్నత పీఠంపై..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఘనత జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌కు దక్కుతుంది. ఆయన 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జులై 11 వరకు ఏడు సంవత్సరాలకు పైగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన కుమారుడు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. సీజేఐగా శనివారం ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ యు.యు.లలిత్‌ తర్వాత జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

సీజేఐగా తక్కువ కాలం పనిచేసిన వారు జస్టిస్‌ కమల్‌ నారాయణ సింగ్‌, జస్టిస్‌ రాజేంద్రబాబు. జస్టిస్‌ సింగ్‌ 1991 నవంబరు 25 నుంచి డిసెంబరు 12 వరకు అతి కొద్ది రోజులు పనిచేశారు. జస్టిస్‌ రాజేంద్రబాబు 2004 మే 2 నుంచి 31 వరకు సర్వోన్నత న్యాయస్థానానికి సారథ్యం వహించారు.

ఇవీ చదవండి: న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.