ETV Bharat / bharat

'బాంబే హైకోర్టు తీర్పు' సవాల్ పిటిషన్​ విచారణకు సుప్రీం ఓకే

లైంగిక వేధింపుల విషయంలో బాంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుకు వ్యతిరేకంగా జాతీయ మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించింది సుప్రీం. వ్యాజ్యంపై స్పందించాలని మహారాష్ట్ర సర్కార్​కు నోటీసులు ఇచ్చింది.

Skin to skin contact: SC agrees to hear NCW's plea against Bombay HC verdict
మహిళా కమిషన్ వ్యాజ్యాన్ని స్వీకరించిన సుప్రీం
author img

By

Published : Feb 10, 2021, 10:33 PM IST

దుస్తుల పైనుంచి బాలిక శరీరాన్ని తాకితే లైంగిక వేధింపులు కాదన్న బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మహిళా కమిషన్ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందన తెలియజేయాలని కోరింది.

మరోవైపు, హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర దాఖలు చేసిన మరో పిటిషన్​పై నిందితుడికి నోటీసులు పంపించింది సుప్రీం. కాగా, ఇతర పిటిషనర్లైన యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, భారతీయ స్త్రీ శక్తి.. తమ వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నాయి. బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై జనవరి 27నే స్టే విధించింది అత్యున్నత ధర్మాసనం.

ఇదీ కేసు

2016 డిసెంబర్​లో 39 ఏళ్ల సతీశ్ అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి పోక్సో చట్టం కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్​ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టుకు చెందిన నాగ్​పుర్ కొట్టివేసింది. దిగువ కోర్టు విధించిన 3 సంవత్సరాల శిక్షను ఏడాది కఠిన కారాగార శిక్షగా మార్చేందుకు సమర్థించింది.

పోక్సో చట్టం ప్రకారం.. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని వివరిస్తోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేక దుస్తుల లోపల చేయి పెట్టాడా? అన్న దానిపై సరైన ఆధారాలు లేవని... కాబట్టి దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని తెలిపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటే కచ్చితమైన, బలమైన సాక్ష్యాధారాలు ఉండాలని వివరించింది. కానీ మహిళ/బాలిక పరువుకు భంగం కలగాలన్న ఉద్దేశంతో ఆమె వక్షస్థలాన్ని తాకితే మాత్రం.. అది క్రిమినల్​ నేరంగా పరిగణించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: 'మోదీజీ... బహిరంగంగా టీకా తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.