ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని ఆరుగురి దారుణ హత్య!

author img

By

Published : Nov 12, 2020, 5:10 AM IST

ఒడిశా బొలంగీర్​ జిల్లా సవరపడా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను గుర్తించారు పోలీసులు.

Six of family found murdered in Odisha village
ఒకే కుటుంబంలోని ఆరుగురి దారుణ హత్య!

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతదేహాలను గుర్తించారు పోలీసులు. ఒడిశాలోని బొలంగీర్​ జిల్లా జిల్లా సవరపడా గ్రామంలోని ఓ ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా మారారు. జిల్లా ఎస్పీ సందీప్​ మడ్కర్​, ఎస్​డీపీఓ, క్లూస్​ టీం, పోలీసు జాగిలాలతో ఆ ఇంటివద్దకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Six of family found murdered in Odisha village
కుటుంబంలోని ఆరుగురు మృతి

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బులు జానీ ఇంటి తలుపులు ఉదయం నుంచి తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారు తలుపులు తట్టారు. ఇంటి లోపలనుంచి స్పందన లేకపోగా.. కిటీకీ తలుపులు తెరిచి చూస్తే అందరూ నేలపై పడుకున్నట్లుగా కనిపించారు. వారిపై దుప్పట్లు కప్పిఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలికెళ్లి చూడగా.. అందరూ మృతిచెంది ఉన్నారు. వీరి తలలపై గాయాలున్నాయి.

బులు జానీ(50), జ్యోతి(48)తో పాటు వారి నలుగురు పిల్లలను పదునైన ఆయుధాలతో చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.