ETV Bharat / bharat

Shamshabad Woman Murder Case Update : శంషాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. కంట్లో కారం కొట్టి చీర కొంగుతో ఉరి

Shamshabad Woman Murder Case Update: శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మంజులను హత్య చేసిన హంతకురాలు రిజ్వానా.. హత్యకు సహకరించిన మరో ఇద్దరని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Woman Killed and Burnt in Shamshabad
Shmshabad Woman Murder Case
author img

By

Published : Aug 12, 2023, 1:44 PM IST

Updated : Aug 12, 2023, 4:52 PM IST

Shamshabad Woman Murder Case Update : శంషాబాద్‌లో జరిగిన మంజుల అనే మహిళ హత్య కేసును పోలీసులు 24గంటల్లోనే చేధించారు. ఈ ఘాతుకానికి లక్ష రూపాయల ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు. నిందితురాలు రిజ్వానా బేగంను అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో సాంకేతిక అధారాలు సేకరించి చేధించినట్లు పేర్కొన్నారు.

డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించామని.. మృతదేహం వద్ద తాళం చెవి, మెడికల్‌ స్లిప్‌ దొరికిందని వీటి ఆధారంతో మృతురాలు మంజులగా గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. నిందితురాలు రిజ్వానా బేగంకు మంజుల గతంలో లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిందని.. ఈ వివాదంతోనే మంజులను ఆమె హత్య చేసిందన్నారు.

Woman Murder Case in Shmshabad : అప్పుకు బాండ్ రాసి ఇస్తానని రిజ్వానా మంజులను ఇంటికి పిలిపించుకుని... ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారంగా మంజుల కళ్లలో కారంతో దాడి చేసి చీరకొంగుతో మెడగట్టిగా ఊపిరి ఆడకుండా చేసి చంపిందని డీసీపీ వివరించారు. ఆతర్వాత మెడలో ఉన్న పుస్తెలతాడు, చైన్​, చెవిపోగులు తీసుకుందని వివరించారు.

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం

రాత్రి 11గంటలు దాటిన తర్వాత మృతదేహాన్ని యాక్టివా బండిపై బయటకు తీసుకువచ్చి సాయి ఎంక్లెవ్‌ ఖాళీ స్థలంలో పెట్రోల్ పోసి తగులపెట్టిందన్నారు. హత్య అనంతరం ఆమె అజ్మీర్​కు వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు తెలిపారు. మరొకరి దగ్గర చేసిన అప్పును తీర్చేందుకు మృతురాలి చైన్​ను ఫైనాన్సింగ్​లో రూ.83వేలకు తాకట్టు పెట్టి.. రూ.50వేలు అప్పు తీర్చిందని వివరించారు. ఇలానే రిజ్వానా చాలా చోట్ల అప్పులు చేసినట్లు డీసీపీ తెలిపారు.

"ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించాము. మృతదేహం వద్ద తాళం చెవి, మెడికల్‌ స్లిప్‌ దొరికిందని వీటి ఆధారంతో మృతురాలు మంజులగా గుర్తించాము. నిందితురాలు రిజ్వానా బేగంకు మంజుల గతంలో లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఇంటికి పిలిచి కంట్లో కారం కొట్టి చీర కొంగుతో మెడకు బిగించి చంపింది. ఆతర్వాత బయటకు తీసుకెళ్లి కాల్చి చంపింది." - నారాయణ రెడ్డి, శంషాబాద్ డీసీపీ

అసలేం జరిగింది : గురువారం అర్ధరాత్రి శంషాబాద్‌లోని సాయిఎన్‌క్లేవ్‌ ఇళ్ల మధ్య రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి ఒంటిపై లభ్యమైన వస్తువులు, సీసీ కెమెరాల్లోని దృశ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టిన పోలీసులు.. తొండుపల్లి వద్ద బంక్‌లో పెట్రోల్‌ తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. దీంతో పోలీసులు దీనిని మిస్టరీ కేసు((Shamshabad Woman Murder Case)గా భావించారు.

దళిత మహిళపై రేప్​.. అనంతరం నిప్పంటించి హత్య.. మరో యువతి గొంతు కోసి..

Shamshabad Woman Murder Latest Update News : అదే విధంగా పరిసర ప్రాంతాల్లో అదృశ్య కేసులపై దృష్టి సారించిన పోలీసులు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో మిస్సింగ్ కేసులపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో.. రెండురోజులుగా తన భార్య కనిపించటంలేదంటూ మంజుల భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్నారు. హత్యకు గురైంది ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళగా పోలీసులు తొలుత భావించినా.. అదృశ్య కేసు ఆధారంగా చేపట్టిన విచారణలో మంజులగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Shamshabad Woman Murder Case Update శంషాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. కంట్లో కారం కొట్టి చీర కొంగుతో ఉరి

Woman Killed and Burnt in Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. మహిళను చంపేసి కాల్చేశారు

Girl Dies of Heart Attack Karimnagar : విషాదం.. ఫ్రెషర్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన విద్యార్థిని

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

Last Updated : Aug 12, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.