భార్యతో బలవంతపు శృంగారం చేసినా (Marital rape) దాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌గఢ్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు భారత శిక్షాస్మృతి 376వ అధికరణ కింద దాఖలైన అభియోగాల నుంచి 37 ఏళ్ల వ్యక్తిని విముక్తున్ని చేసింది. అయితే అతనిపై 377 అధికరణ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు (Unnatural offences) ఇతర అభియోగాలు కొనసాగుతాయని పేర్కొంది.
చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయసు 18 ఏళ్లు లోపు లేకపోతే.. బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదని 376వ అధికరణలోని రెండో మినహాయింపు స్పష్టంగా చెబుతోందని న్యాయమూర్తి తెలిపారు. అందుకే ఆ అభియోగాల నుంచి విముక్తి కల్పించినట్లుపేర్కొన్నారు.
ఇదీ చదవండి: Condom: కండోమ్ మరిచిపోయి అసహజ రీతిలో.. చివరకు?