ETV Bharat / bharat

పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు దుర్మరణం - road accident in Solapur

పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు అతి వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని సోలాపుర్​లో జరిగింది.

road accident in Solapur
road accident in Solapur
author img

By

Published : Oct 31, 2022, 8:46 PM IST

మహారాష్ట్ర సోలాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం సంగోలా పట్టణంలో సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. "కొల్హాపుర్​ జిల్లాలోని జతర్​వాడీకి చెందిన 32 మంది భక్తులు పంధార్​పుర్​కు దైవ దర్శనానికి పాదయాత్ర చేస్తూ బయలుదేరారు. ఈ క్రమంలో సంగోలా చేరుకున్న వీరిపై ఓ కారు అదుపుతప్పి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు." అని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.